Moviesభార్య పై ప్రేమతో బోనీ కపూర్..శ్రీదేవి చనిపోయిన ఇప్పటికి ఆ పని...

భార్య పై ప్రేమతో బోనీ కపూర్..శ్రీదేవి చనిపోయిన ఇప్పటికి ఆ పని చేస్తున్నాడా..? గ్రేట్ మొగుడువయ్య..!!

సినీ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలు తన నటనతో ఫిలిం ఇండస్ట్రీ ని ఏలేసిన నటి శ్రీదేవి. తెలుగు, హిందీ, తమిళం ,మలయాళం, భాషలలో వందలాది సినిమాలలో హీరోయిన్గా నటించి తన అందంతో అభినయంతో నటనతో కోట్లాదిమంది ప్రజలను ఫ్యాన్స్ గా మార్చుకున్న శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. అతిలోకసుందరి అంటారు ..కుందనపు బొమ్మ అంటారు.. ఆమెను ఇలా పిలుచుకునే జనాలు బోలెడు మంది ఉన్నారు . తమిళనాడులోని శివకాశిలోజన్మించిన శ్రీదేవి..ఎవ్వరు ఊహించని విధంగా 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో ఓ హోటల్లో అనుమానస్పద స్థితిలో మరణించింది.

కాగా ఈమె మరణానికి గల కారణాలపై ఇప్పటికీ క్లారిటీ లేదు. కొందరు శ్రీదేవి బాత్రూంలో కాలు జారిపడింది అంటారు. మరికొందరు బోనీకపూర్ కావాలనే ఆమెను తన ఆస్తి కోసం చంపేశారు అని అంటారు. మరి కొందరు ఆమె సూసైడ్ చేసుకుంది అంటారు . శ్రీదేవి చనిపోవడానికి సరైన కారణం కుటుంబం బయట పెట్టకపోవడంతో జనాలు తమ నోటికి తమకు నచ్చిన విధంగా ఊహించుకుంటున్నారు. అయితే ఎవరు ఎన్ని చేసినా శ్రీదేవి లేని లోటు బోనీ కపూర్ కి తీరలేనిది . మనకు తెలిసిందే శ్రీదేవి బోని కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె సినిమాలో నటించే టైంలోనే బోనికపూర్ తో డేటింగ్ చేసింది . ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయింది.

దీంతో 1996 జూన్ రెండున సింపుల్గా వివాహం చేసుకున్నారు బోనీకపూర్ శ్రీదేవి. పెళ్లి అయిన కొన్ని నెలలకే జాన్వికపూర్ కి జన్మించింది. ఇక ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో కృషి కపూర్ జన్మించింది .వీరిద్దరికీ ఇద్దరు కూతుర్లు. కాగా శ్రీదేవి మరణించిన తర్వాత కొన్నాళ్లు బోనీకపూర్ డిప్త్రెషన్ కి లోనైపోయారట . ఆ తర్వాత పలు తెరఫీల ద్వారా నార్మల్ కండిషన్లోకి వచ్చిన బోనికపూర్.. శ్రీదేవి కోసం ఆమె లేకపోయినా ఇప్పటికీ తనకిచ్చిన మాటను నెరవేరుస్తున్నారట . శ్రీదేవికి ఫస్ట్ నుంచి పేద పిల్లలకు ఫుడ్ పెట్టే అలవాటు ఉందట. ఇంట్లో ఎవరు పుట్టినరోజు ..వాళ్ల పెళ్లిరోజు అయినా అన్నదానం చేస్తుందట. అమ్మ నాన్న లేని పిల్లలకి తనకు తగ్గ సహాయం చేస్తుందట . ఈ క్రమంలోని శ్రీదేవి ఈ లోకాన లేకపోయినా సరే బోనీకపూర్ ఆమె పుట్టినరోజుకి వాళ్ళ పెళ్లి రోజుకి పిల్లల పుట్టిన రోజులకి ఇంకా పలు ఆర్ఫనేజ్ కు వెళ్లి శ్రీదేవి పేరిట అన్నదానం చేస్తున్నారట. నిజంగా ఇలాంటి భర్త దొరకడం గ్రేట్ అంటున్నారు బాలీవుడ్ జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news