Moviesతనతో నటించిన హీరోయిన్స్ లో ప్రభాస్ కి ఇష్టమైన ముద్దుగుమ్మ ఎవరో...

తనతో నటించిన హీరోయిన్స్ లో ప్రభాస్ కి ఇష్టమైన ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈశ్వర్ సినిమాతో తన సినీ కెరియర్ ని ప్రారంభించిన ఈ హీరో ..ప్రజెంట్ అన్ని పాన్ ఇండియా రేంజ్ సినిమాలే చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. బాహుబలి సినిమా తరువాత ఒక్కసారిగా ప్రభాస్ క్రేజ్, రేంజ్ డబుల్ అయ్యాయి. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ తో సినిమా అంటే హీరోయిన్స్ ముందు ఇంట్రెస్ట్ చూపిస్తారు.

దానికి కారణం ఆయన చాలా కోపరేట్ చేస్తాడు..సరదాగా ఉంటాడు. ఈ క్రమంలోని హీరోయిన్స్ ఆయనతో సినిమా అంటే ఎగిరికి గంతేస్తారు. కాగా ప్రభాస్ ఇప్పటివరకు తన కెరియర్ లో బోలెడంత మంది హీరోయిన్స్ తో నటించారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ముద్దుగుమ్మలతో ఆడి పాడి అలరించారు . అయితే ప్రభాస్ నటీంచిన సినిమాలలో అందరి హీరోయిన్ల లో కల్లా ఆయనకు కన్వీనెంట్గా అనిపించింది ..ఆయన మళ్లీ మళ్ళీ ఆ హీరోయిన్ తో సినిమాలు చేయాలి అనుకునింది మాత్రం కేవలం ఒకే ఒక హీరోయిన్ తో నట. అదే త్రిష .

మనకు తెలిసిందే తెరపై ప్రభాస్-త్రిష జంట ఎంత హిట్ పెయిరో. వర్షం సినిమాతో జతకట్టిన వీరు ఆ తర్వాత పౌర్ణమి సినిమాలో, బుజ్జిగాడు సినిమాలో తమదైన స్టైల్ లో నటించి అలరించారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సినిమా షూటింగ్ టైంలో కూడా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతారట. ఏ సీన్ అయిన సరే ఒక్కే షాట్ లో ఓకే చేసేసుకుంటారట . అంత మంచి కోఆర్డినేషన్ వీళ్ళ మధ్య ఉంది అని సినిమా సభ్యులు కూడా చెప్పుకొస్తారు . అయితే త్రిష తర్వాత ప్రభాస్ కి అంత బాగా కెమిస్ట్రీకి కుదిరిన హీరోయిన్ అయితే మాత్రం అనుష్క అనే చెప్పాలి . వీళ్ళిద్దరి జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియాలో వీళ్ళపై రోజు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. వీళ్ళు పెళ్ళి చేసుకుంటే చూడాలి అనేది కోట్లాది మంది అభిమానుల కోరిక,,,మరి ఆ కోరికను ఈ జంట ఎప్పుడు తీరుస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news