Moviesఆ సినిమాలో ఛాన్స్ కావాలంటే..రోజు ఒక్క గంట అలా చేయమన్నారు..నా లైఫ్...

ఆ సినిమాలో ఛాన్స్ కావాలంటే..రోజు ఒక్క గంట అలా చేయమన్నారు..నా లైఫ్ లో మర్చిపోలేను..సుదీప కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రావడం అనేది చాలా కష్టమైన పని. గ్లామరస్ ప్రపంచంలో గ్లామర్ గా లేకపోతే జనాలు పెద్దగా యాక్సెప్ట్ చేయరు . జనాలకు నచ్చని హీరోయిన్స్ ని దర్శక నిర్మాతలు ఎప్పటికీ వాళ్ళ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇవ్వరు. ఇప్పటివరకు మనకు తెలిసిన విషయం ఇదే. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసే వాళ్లకు కూడా దర్శకనిర్మాతలకు కొన్ని కండిషన్స్ పెడతారని తమ బాడీ తీరును మార్చుకోవాలని సజెస్ట్ చేస్తారని అలాంటి ఇన్సిడెంట్ తనకు ఎదురయిందని బిగ్ బాంబ్ పేల్చింది చెల్లి పాత్రలు చేసుకునే సుదీప.

సుదీప ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు . పింకీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తన ఒరిజినల్ నేమ్ కంటే క్యారెక్టర్ నేమ్ కి ఎక్కువ జనాలు కనెక్ట్ అయిపోయారు . నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా పింకీ అనే పాత్రలో మెరిసింది . చాలా అల్లరిగా ..చలాకిగా మాటకారితనంతో ..ఆ రోల్ ని పింకీ తప్పిస్తే ఎవ్వరు చేయలేరు అన్న విధంగా తన పేరును జనాలకి ఎక్కిచ్చేసింది. అంతేకాదు సినిమాలో హీరోగా వెంకటేష్ హీరోయిన్గా ఆర్తి అగర్వాల్ ఎంత ఫేమస్ అయ్యారో చెల్లి పాత్రలో పింకీ కూడా అంతే ఫేమస్ అయింది .

ఈ సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీలో చెల్లి పాత్ర అంటే టక్కున అందరికీ గుర్తొచ్చింది పింకీనే. అంతలా ఆమె పేరు జనాలకు రిజిస్టర్ అయిపోయింది. ఈ క్రమంలోని ఆమె బోలెడు సినిమాల్లో చెల్లి పాత్రలు నటించింది . అయితే ఏ సినిమాకి కూడా పెద్దగా కష్టపడలేదట కానీ సెవెన్ బై జి బృందావన కాలనీ సినిమాకు మాత్రం చాలా కష్టపడిందట . ఈ సినిమాలో తన చెల్లి రోల్ కోసం డైరెక్టర్స్ కొన్ని కండిషన్స్ పెట్టారట . బొద్దుగా ఉన్నావు సన్నగా మారమని చెప్పారట . అంతేకాదు నువ్వు చాలా తెల్లగా ఉన్నావు ఈ సినిమాలో ఈ పాత్ర కోసం నాచురల్ గా నల్లగా ఉండాలి ..దాని కోసం నీకు ఒక వన్ మంత్ టైం ఇస్తున్నాము నువ్వు నల్లగా మారడానికి ప్రయత్నించు అంటూ చెప్పుకొచ్చారట.

ఈ క్రమంలో ఏం చేయాలో తెలియక సుదీప రోజు ఒక గంట సేపు ఎండలో నిల్చుందట. దీంతో ఫేస్ ట్యాన్ అయిపోయి బ్లాక్ షేడ్ గా మారిపోయిందట. అంతలా సెవెన్ బై జి బృందావన కాలనీ సినిమా కోసం కష్టపడ్డాడని సుదీప చెప్పుకొచ్చింది. ఏదేమైనా సరే సుదీప్ లాంటి మంచి యాక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉంటే ఇంకా బాగుండేది . మరి ఎందుకు సుదీప సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది ..?అవకాశాలు రాకనా..? వచ్చిన అవకాశాలు నచ్చకనా..? అనేది జనాలకి అర్థం కావడం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news