Moviesఇండస్ట్రీలో ఇన్నాళ్లు ఉన్నా ..ఎవ్వరు నా ఆ కోరిక తీర్చుకోలేకపోయారు.. ఓపెన్...

ఇండస్ట్రీలో ఇన్నాళ్లు ఉన్నా ..ఎవ్వరు నా ఆ కోరిక తీర్చుకోలేకపోయారు.. ఓపెన్ గా చెప్పి షాకిచ్చిన ఆమని..!!

ఆమని ఈ పేరుకు ప్రత్యేక పరచయాలు అవసరం లేదు . తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇ వి వి సత్యనారాయణ డైరెక్ట్ చేసిన జంబలకడిపంబ అనే సినిమాలో హీరోయిన్గా నటించి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది . మనకు తెలిసిందే జంబలకడిపంబ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో.. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే నవ్వుకునే జనాలు చాలామందే ఉన్నారు.

ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోని ఆమెని ఖాతాలో శుభలగ్నం ,శుభసంకల్పం, మిస్టర్ పెళ్ళాం ,మావిచిగురు , ప్రియమైన శ్రీవారు లాంటి ఎన్నో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ మొత్తంలో ఆమని దాదాపు 35 సినిమాల్లో నటించింది. అయితే తన కోరికను మాత్రం ఎవ్వరు తీర్చుకోలేకపోయారట. ఇప్పటికైనా ఆ కోరిక నెరవేరకపోతుందా అంటూ ఆశగా ఎదురు చూస్తుందట . ఇదే విషయం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చి ఆమని బాధపడింది .

నిజానికి ఆమని కి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టమట . బిగ్గెస్ట్ ఫ్యాన్. ఇప్పటికీ ఆయన సినిమాలు మిస్ కాకుండా చూస్తుందట. కాగా ఆయనతో కనీసం ఒక్కసారి అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటినుంచో కోరుకుంటుందట. జంబలకడిపంబ హిట్ అయిన తర్వాత ఎంతో ఆశగా మెగాస్టార్ చిరంజీవి అవకాశం వస్తుందని వెయిట్ చేసిందట. కానీ ఆమెకు ఆ అదృష్టమే దక్కలేదట. ఒకానొక టైం లో చిరంజీవితో నటించే అవకాశం వచ్చినా కొన్ని కారణాలు చేత అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందట .

 

 

 

ఈ క్రమంలోనే ఆమని చాలా బాధపడిందట . ఎప్పటికైనా నాకు అవకాశం రాకపోతుందా అంటూ వెయిట్ చేస్తుందట. అంతేకాదు “నేను చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశాను కానీ ఏ డైరెక్టర్ కూడా నాకు చిరంజీవితో నటించాలన్న కోరికను తీర్చలేకపోయారు ” అంటూ బాధపడిందట, మరి చూడాలి భవిష్యత్తులో అయినా నా కోరిక తీరకపోతుందా అని వెయిట్ చేస్తున్నాను అంటూ ఆమెని ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చింది .కాగా ప్రజెంట్ ఆమని హీరోలకు అమ్మగా నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ నుంచి కంటిన్యూ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news