Moviesనటి శైలజ ప్రియా జీవితంలో అన్ని కష్టాలు ఉన్నాయా..? కట్టుకున్న...

నటి శైలజ ప్రియా జీవితంలో అన్ని కష్టాలు ఉన్నాయా..? కట్టుకున్న వాడే అలా చేయడంతో…?

సినిమావాళ్ళ జీవితాలు బయటకు కలర్ ఫుల్ గా కనిపించినా వారి జీవితంలోనూ కష్టాలు కన్నీళ్లు ఉంటాయి. కాకపోతే ఎప్పుడూ చెప్పుకోరు కాబట్టి స్క్రీన్ పై చూసి చాలా ఎంజాయ్ చేస్తారని అంతా అనుకుంటారు. అయితే కొంతమంది జీవితంలో విషాదం కూడా ఉంటుంది. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు తెచ్చుకున్న బ్యూటీ శైలజ ప్రియ మ‌నంద‌రికి తెలిసిందే. 40 ఏళ్ల వ‌య‌స్సు దాటుతున్నా ఆమె అందం ఏ మాత్రం చెక్కు చెద‌ర్లేదు. అయితే ఆమె తెర‌మీద ఎన్ని న‌వ్వులు చిందించినా ఆమె జీవితంలోనూ విషాదం ఉందట. శైలజ ప్రియా గతంలో బిగ్ బాస్ సీజన్ లో ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రియగా ఎక్కువ మందికి తెలుసు కానీ ఆమె అసలు పేరు శైలజ ప్రియ. ఇక శైలజ ప్రియ తన భర్త నుండి విడిపోయింది అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం తో విడిపోయారట. ఇక బిగ్ బాస్ లో ఈ విషయం పై మాట్లాడుతూ….. “అందానికి అందమైన ముద్దుగుమ్మ నడిచి వచ్చే సమయంలో.. ప్రేమ అందమైన ఊహాలోకంకు ఒంటరిగా ఆహ్వానిస్తుందని ఊహించలేదని పేర్కొంది. కానీ ఎప్పుడూ ఇలానే సాగిపోవాలనే కొన్ని మధుర క్షణాలు ఎప్పుడూ శాశ్వతం కాదని తెలిసిపోయింది.

ఒక్క నిర్ణయం వంద సంవత్సరాల కష్టాన్ని మరిచిపోయేలా చేస్తుందని… ఆ నిర్ణయం కోసం 18 సంవత్సరాలుగా ఒక మగువ చేసిన అన్వేషణను ఏ విధంగా వర్ణించగలం అంటూ ప్రశ్నించింది. కట్టుకొనే వాడితో కలకాలం కలిసి ఉండాలనే ఆశతో…. కలిసి ఉండాలనే నమ్మకంతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి సంతోషం ప్రతి సారి పూల బాట కాదు అని తెలుసుకోవాలని పేర్కొంది.

అంతే కాకుండా మనసారా ఘన స్వాగతం చెప్పే ప్రేమను చేరుకోడం ఆ అమ్మాయి కోరుకొన్న జీవితాన్ని చేరుకోవడానికి అన్నిసార్లు సాధ్యపడకపోతే ఊహించని ఓదార్పు అవసరం.” అంటూ శైలజ ప్రియ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే శైలజ ప్రియ 2002 లో కిషోర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీరికి 2003 లో కొడుకు పుట్టాడు. ప్రస్తుతం శైలజ ప్రియ కొడుకు కూడా ఆమె వద్దనే ఉంటున్నాడు. ఇక శైలజ ప్రియ గతం లో ఈ కామెంట్స్ చేసినప్పటికీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక శైల‌జ వ‌య‌స్సు ప్ర‌స్తుతం 42 ఏళ్లు. ఆమెకు సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోవ‌ర్స్ చూస్తుంటే తెలుగులో స్టార్ హీరోయిన్ల‌తో సమానంగా ఫాలోవ‌ర్స్ ఉంటారు. అది శైల‌జ క్రేజ్‌. ఇక శైల‌జ ప్ర‌స్తుతం సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప్రాధాన్య‌త ఉన్న రోల్స్‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం భ‌ర్త‌కు దూరంగా ఉండ‌డంతో త‌న కుమారుడి భ‌విష్య‌త్తును తీర్చిదిద్దుకునే ప‌నిలో ఆమె బిజీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news