Movies100 కోట్ల క్లబ్ లోకి F3..డైరెక్టర్ అనిల్ రావిపూడి సంచలన ప్రకటన..!!

100 కోట్ల క్లబ్ లోకి F3..డైరెక్టర్ అనిల్ రావిపూడి సంచలన ప్రకటన..!!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర ఎఫ్ 3. ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి నుండి ఈ సినిమా పై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు. ఇక వాతీని ఏ మాత్రం డైన్ చేయకుండా చూస్కున్నాడు అనిల్ రావిపూడి. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఎఫ్ 3 ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. వ‌రుణ్‌తేజ్ – వెంకీ మ‌ల్టీస్టార‌ర్ ఎఫ్ 3 సినిమాకు హిట్ టాక్ వ‌చ్చింది.

సేమ్ F2 లో నటించిన హీరోయిన్స్ నే ఇందులో కూడా కనిపించారు. మిల్కీ బ్యూటీ తమన్నా.. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించి..గ్లామరస్ గా మెప్పించారు. అయితే, ఫ్3 లోకి కొత్తగా మరో ముద్దుగుమ్మ ను ఎంటీ ఇచ్చి..సినిమాకి మరింత హైప్ తెచ్చారు అనిల్. అయితే, సినిమాలో అక్కడక్కడ కొన్ని లాజిగ్ లేని సీన్స్ ఉన్నా..అవన్నీ కూడా అనిల్ మ్యాజిక్ లు అంటూ..జనాలు ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఫ్3 సినిమా దూసుకుపోతుంది. సూపర్ కలెక్షన్స్ తో కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ ఏమో.. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.73 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా F3 సినిమా..ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రూ.102 కోట్ల వసూళ్లతో రూ. 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి తో పాటు.. మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఓవ‌రాల్‌గా అనిల్ రావిపూడి కెరీర్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిల‌వ‌డంతో పాటు అనిల్ టాలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్ల లీగ్‌లో చేర్చేసింది. ఆరేళ్లలో ఆరు వ‌రుస హిట్ల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టి.. ఇక్క‌డ రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం అన్న‌దే లేని ద‌ర్శ‌కుడిగా అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు. F2, F3 మంచి విజ‌యాలు అందుకున్నాయి.

వీటిని మించి ఉండేట‌ట్లుగా ఎఫ్‌4 క‌థ‌ను అనిల్ రావిపూడి సిద్ధం చేస్తున్నారట. దాని గురించి కూడా అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే ఉంటుందని సంచల ప్రకతన చేశాడు అనిల్ రావిపూడి. ఎఫ్ 3 స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న అనిల్ త‌న నెక్ట్స్ సినిమాను నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news