Moviesత్రివిక్రమ్ కి ఆ హీరో అంటే మంట..అంత ఘోరంగా అవమానిచాడా ..?

త్రివిక్రమ్ కి ఆ హీరో అంటే మంట..అంత ఘోరంగా అవమానిచాడా ..?

సినీ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే అందరికి అదో తెలియని ప్రత్యేకమైన గౌరవం. ఎవ్వరి జోలికి వెళ్ళడు. కంట్రవర్షీయల్ కామెంట్స్ చేయడు. తన పని తాను చూసుకుని వెళ్లిపోతుంటాడు. పైగా ఇండస్ట్రీలో కి ఎంతో కష్టపడి వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద డైరెక్టర్ గా మారాడు అని చాలా మందికి ఆయనని కష్టానికి మరో మారుపేరు అంటుంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్.. రైటర్ గా 1999లో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. దాదాపు మూడేళ్ల పాటు రైటర్ గా తన టాలెంట్ తో పలు సినిమాలకు పని చేసిన ఈయన..ఆ తరువాత 2002లో డైరెక్టర్ గా మారాడు.

ఇండస్ట్రీలో ఆయనని ముద్దుగా మాటల మాంత్రికుడు అని పిల్చుకుంటారు. అమత పవర్ ఉంది ఆయన రాసే డైలాగ్స్ కి. త్రివిక్రమ్ ఎంత ప్రతిభ కలవాడు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మాటల తూటాలతో యువత ని ఉత్సాహ పరుస్తుంటాడు. దెబ్బ కొడుతూనే నవ్వించే డైలాగ్స్ తాయడం లో త్రివిక్రమ్ దిట్ట. ప్రజెంట్ మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్న త్రివిక్రమ్ … ఆ తరువాత మళ్ళీ ఆయన జాన్ జిగిడి దోస్త్ పవన్ తో మరో సినిమా కి ప్లాన్ చేస్తున్నారట. అయితే, ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈ మాటల మాంత్రికుడికి.. ఓ స్టార్ హీరో కి మధ్య గత కొన్నాళ్ళు గా కోల్డ్ వార్ జరుగుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

గతంలో అంటే జల్సా సినిమా టైంలో ఈ గొడవ స్టార్ట్ అయ్యిందట. నిజానికి ఆ టైంలో త్రివిక్రమ్ మంచి ఫాం లో ఉన్నాడు. పట్టిందల్లా బంగారమే అన్నట్లు దూసుకుపోయాడు . ఆ టైంలో ఆయన తో సినిమాలకు స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూయించారు. అయితే, జల్సా సినిమా కధను మొదట వినిపించింది..మరో యంగ్ స్టార్ హీరోకి. ఆయనకు ఆ కధ నచ్చేసి.. మూడు నెలలు టైం అడిగారట. వేరే సినిమా 70 శాతం షూటింగ్ అయిపోయింది. మరో మూడు నెలల్లో అంతా అయిపోతుంది. ఈ సినిమా ని ప్లాన్ చేద్దాం అంటూ చెప్పుకొచ్చారట.

అయితే, ఆ స్టోరీని సరదాగా పవన్ కి వినిపించడం..ఆయనకి బాగా నచ్చేయడంతో..యంగ్ హీరోని కాదని..తన ఫేవరేత్ హీరోతో సినిమాను తెరకెక్కించాడట త్రివిక్రమ్. అబ్బో ఈ సినిమా రిలీజ్ టైం లో పెద్ద హంగామానే నడిచింది. దీంతో హర్ట్ అయిన హీరో.. త్రివిక్రమ్ పై పరోక్షంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ గా కూర్చోని మ్యాటర్ సాల్వ్ చేసుకుందాం అని ఇంటికి వెళ్లిన త్రివిక్రమ్ కి ఆయన ఇంట్లోనే ఉండి లేడు అని చెప్పించడం బాధకలిగించిందట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ హీరో తో ఒక్క సినిమా కూడా చేయలేదు..ఆయన సినిమా ఫంక్షన్లకి హాజరు కాలేదు త్రివిక్రమ్ అంటూ ఇండస్ట్రీ వర్గాలు చెప్పుతుంటాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news