Moviesఆ విషయంలో కీర్తిని ఎంత పొగిడినా తక్కువే..హ్యాట్సాఫ్..!!

ఆ విషయంలో కీర్తిని ఎంత పొగిడినా తక్కువే..హ్యాట్సాఫ్..!!

కీర్తి సురేష్.. హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ పాత్రలే కాదు నటనలో కూడా ది బెస్ట్ గా నటించగలదు అని ప్రూవ్ చేసిన నటి. కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటీ వరకు తాను నమ్ముకున్నది ఒక్కటే. సినిమా హిట్టా ఫట్టా అని చూసుకోకుండా.. తాను చేసిన పాత్రలు ఢిఫరెంట్ గా ఉన్నాయా.. సినిమాలో తన పాత్రకు వాల్యూ ఉందా..ఆ పాత్ర ద్వారా ఆమె సంతోషం గా ఉన్నారా..? ఈ మూడింటినే చూసుకుంటారట. రెమ్యూనరేషన్ విషయంలో కూడా పెద్ద పట్టించుకోరు అని స్టార్ డైరెక్టర్లు సైతం అమ్మడుని పొగిడేస్తుంటారు. ఎటువంటి ఎక్స్ ప్రేషన్స్ ని అయినా కళ్లతో పలికించే టాలెంట్ ఉన్న నటి..అందుకే కాబోలు అందరు మహానటి అంటుంటారు.

అయితే, సావిత్రి గారి బయోపిక్ మహానటి సినిమా తరువాత నుండి కీర్తి కి ఒక్కటి అంటే ఒక్క హిట్ కూడా పడలేదు. బోలెడు సినిమాలు చేసినా..ఇప్పటి వరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయింది కీర్తి సురేష్ మహానటి సినిమా తరువాత. అయితే, ఇన్నాళ్లుకు ఆమె కళ నెరవేరింది. మహానటీ సినిమా తరువాత ఫస్ట్ హిట్ అందుకుంది. ఈ మధ్య కాలంలో వరుసగా లేడీ ఓరియంటేడ్ సినిమాలు చేస్తూ..ఫుల్ స్వింగ్ మీద ఉన్న కీర్తి ..రీసెంట్ గా చిన్ని అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సాని కాయిదం అనే సినిమా కి అనువాదం..డైరెక్ట్ గా అమేజాన్ ద్వారా రిలీజైన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుంది.

కమర్షియల్ హిట్ అని చెప్పలేం కానీ.. మహానటి తరువాత అంత బాగా నటించి జనాలను మెప్పించింది కీర్తి సురేష్. సినిమా మొత్తానికి కీర్తినే హైలెట్ గా కనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లు చూసి జనాలు షాకైపోయారు. ఏంటి రా బాబు కీర్తి ఇలాంటి పాత్రలో నతిస్తుంది అంటూ సినిమా పై నెగిటీవ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు సినిమా చూసి అంతకు మించి షాకవుతున్నారు.

కీర్తి నటన అధ్బుతం అని మెచ్చుకుంటున్నారు. తనకు జరిగిన ఘోర అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే పాత్రలో కీర్తి నతీంచలేదు జీవించేసింది. ఇంత వరకు ఏ హీరోయిన్ కూడా ఇలాంటి రోల్ చేయలేదు.. అత్యంత కిరాతకంగా హత్యలు చేసే సన్నివేశాల్లో కీర్తి పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సూపర్ కీర్తి..నీ పర్ ఫామెన్స్ మహాధ్బుతం అంటూ ఓ రేంజ్ పొగిడేస్తున్నారు. కొందరు అయితే హ్యాట్సాఫ్ కీర్తి హీరోయిన్ అంటే నీలానే ఉండాలి..అన్ని రకాల పాత్రలు చేయాలి అంటూ చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news