Moviesఎన్టీఆర్‌కు దూర‌మై అంతా పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్‌... జీవితం త‌ల్ల‌కిందులైందిగా...!

ఎన్టీఆర్‌కు దూర‌మై అంతా పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్‌… జీవితం త‌ల్ల‌కిందులైందిగా…!

సినీరంగంలో సుదీర్ఘ కాలం ప‌నిచేసిన అన్న‌గారు.. ఎన్టీఆర్ ఎంతో మంది హీరోల‌కు, హీరోయిన్ల‌కు మార్గ‌ద‌ర్శిగా నిలిచారు. ఆర్థిక ప‌ర‌మైన అంశాల్లోనే కాకుండా.. అనేక విష‌యాల్లో వారికి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చేవారు. ఇలా అన్న‌గారి స‌ల‌హాల‌తో ఆస్తులు సంపాయించుకున్న‌వారు.. సినీ రంగంలో త‌మ‌కంటూ.. ప్ర‌త్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్న‌వారు ఉన్నారు. అయితే.. ఒక హీరోయిన్ మాత్రం అన్న‌గారి మాట‌ను పెడ‌చెవిన పెట్టి.. ఆర్థిక క‌ష్టాలు కొని తెచ్చుకుంద‌ని.. సినీ ఫీల్డ్‌లో ఇప్ప‌టికీ ఒక టాక్ న‌డుస్తూనే ఉంది. ఆ హీరోయినే.. కాంచ‌న‌.

ఓల్డ్ మూవీల్లో సావిత్రి, అంజ‌లీదేవి, భానుమ‌తిల స‌మ‌యంలో బాల న‌టిగా ప‌రిచ‌మైంది. త‌ర్వాత‌.. కాలంలో పుంజుకుని హీరోయిన్‌గా కూడా రాణించిన కాంచ‌నది ఏపీనే. ఈ అభిమానంతోనే అన్న‌గారు అంద‌రికీ చెప్పిన‌ట్టే అనేక స‌ల‌హాలు ఆమెకూ చెప్పారు. ముఖ్యంగా అప్ప‌ట్లో ఇప్పుడు ఇస్తున్న మాదిరిగా రెమ్యున‌రేష‌న్లు డిమాండ్ చేసే ప‌రిస్థితి లేదు. సినీ నిర్మాత‌లు ఇచ్చిన సొమ్ముతోనే స‌రిపుచ్చుకోవాలి. ఆ వ‌చ్చే మొత్తంలో అంతో ఇంతో దాచుకోమ‌ని.. అన్న‌గారు.. అంద‌రికీ స‌ల‌హాలు ఇచ్చేవారు.

అంతేకాదు.. కుటుంబాల‌ను కూడా న‌మ్మ‌వ‌ద్ద‌ని చెప్పేవారు. మ‌రీ ముఖ్యంగా సినిమాల్లో ప‌రిచ‌యం అయిన వారితో ఎంత వ‌ర‌కు ఉండాలో అంత‌వ‌ర‌కే ఉండాల‌ని చెప్పేవారు. ఆయ‌న కూడా వీటిని తూ.చ త‌ప్ప‌కుండా పాటించేవారు. అయితే.. అన్న‌గారు చెప్పిన ఈ మాట‌ల‌ను శార‌ద‌, భానుమ‌తి (అప్ప‌టికే ఆవిడ ఆర్థికంగా బ‌లంగా ఉన్నారు), అంజ‌లీదేవి వంటి న‌టీమ‌ణులు పాటించారు. ఆర్థికంగా బ‌లోపేతం అయ్యారు. అయితే.. కాంచ‌న మాత్రం మితిమీరిన దాన ధ‌ర్మాలు చేయ‌డం.. కొడుకుల‌కు పూర్తిగా స్వ‌తంత్రం ఇచ్చేయ‌డం.. భ‌ర్త‌కు త‌న ఆర్థిక విష‌యాల్లో పూర్తిగా స్వేఛ్చ‌ను ఇచ్చేశారు.

దీంతో సినిమాలు డ‌ల్ అయి.. పూర్తిగా కుంగిపోయింది. ఈ విష‌యం తెలుసుకున్న అన్న‌గారు.. హైద‌రాబాద్‌లో ఉచితంగా స్థ‌లం ఇస్తాను.. ర‌మ్మ‌ని ఆహ్వానించారు. అయితే.. ఆమె ఆ ఆహ్వానాన్ని కూడా తిర‌స్క‌రించారు. ఎందుకంటే.. అప్ప‌టి వ‌ర‌కు అన్న‌గారు చెప్పింది పాటించ‌నందున తాను న‌ష్ట‌పోయాన‌ని భావించి కొంత ఆవేద‌న‌కు గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ఆ సాయాన్ని కూడా ప‌క్క‌న పెట్టిన అన్న‌గారు. తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని.. చేసిన పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి చ‌రిత్ర సినిమాలో కాంచ‌న‌కు అవ‌కాశం క‌ల్పించారు.

ఈ సంద‌ర్భంలోనే ఆమెకు మంచి రెమ్యూన‌రేష‌న్ ఇప్పించారు. ఆ త‌ర్వాత‌.. ఆమె తెలుగు సినిమాల‌కు దూర‌మ‌య్యారు. కేవ‌లం త‌మిళ‌నాడుకే ప‌రిమిత‌మ‌య్యారు. ఇదే విష‌యాన్ని చివ‌రి రోజుల్లో ప‌లు చానెళ్లకు ఇచ్చి ఇంటర్యూల్లోనూ కాంచ‌న చెప్పుకొచ్చారు. అన్న‌గారి ఆద‌ర‌ణ‌.. దూర‌దృష్టి గురించి.. త‌లుచుకుని క‌న్నీరు పెట్టుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news