Moviesఆ మీడియా నన్ను పొగుడుతుంది అని అనుకోలేదు..షాకింగ్ విషయాలను బయటపెట్టిన రాజమౌళి..!!

ఆ మీడియా నన్ను పొగుడుతుంది అని అనుకోలేదు..షాకింగ్ విషయాలను బయటపెట్టిన రాజమౌళి..!!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ RRR. రౌద్రం – ర‌ణం – రుధిరం .. ఎట్ట‌కేల‌కు మూడున్న‌రేళ్లు ఊరించి థియేట‌ర్లలోకి వ‌చ్చింది. ఒక‌టా రెండా లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు. ఇవ‌న్నీ దాటుకుని మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ 14 భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యి నాటి ఉండి ఎన్నెన్నో సంచ‌ల‌న రికార్డులు ఈ సినిమా క్రియేట్ చేస్తోంది. రు. 900 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు దాటేసిన త్రిబుల్ ఆర్ త్వ‌ర‌లోనే రు. వెయ్యి కోట్ల క్ల‌బ్‌లో చేరిపోనుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్‌కు చేరువ‌లో ఉంది. రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లను ఆకట్టుకుంటుంది.

ఇక నైజాం లో అయితే ఇప్పటి వరకు ఏ సినిమా కలెక్ట్ చేయని 100 కోట్లు వసూళ్లు చేసి.. సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో దిల్ రాజు చిత్ర బృందానికి..స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. కాగా, ఈ సినిమా ఇమత్టి ఘన విజయం అందుకున్న సంధర్భంగా చిత్ర బృందం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సంధర్భంగా ఓ ప్రముఖ పత్రికా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో రాజమౌళి మాట్లాదుతూ సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.

ఆయన మాట్లాదుతూ..” RRRసినిమా సక్సెస్ అవుతుంది అనుకున్నాము కానీ ఇంతటి భారీ విజయాని అందుకుంటుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఈ సినిమా చూసిన పలువురు స్టార్స్ కూడా RRR గురించి గొప్పగా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది నాకు మేసేజ్స్ చేస్తున్నారు.పొగుడుతున్నారు. కానీ, అగ్ర రాజ్యం అమెరికా దేశం కూడా RRR ని పొగుడుతుందని ఊహించలేకపోయాను. న్యూయార్క్ టైమ్స్ వంటి అతిపెద్ద మీడియా RRR గురించి ఓ స్పెషల్‌ అర్టికల్‌ రాసింది. అది చదివినప్పుడు నా మనసు భావోద్వేగంతో నిండిపోయింది. నిజంగా ఆ ఆర్టికల్ నాకు చాలా చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక త్వరలోనే ఈ సినిమా 1000కోట్ల క్లబ్ లోకి కి చేరిపోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news