Moviesనంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ... బాల‌య్య - క‌ళ్యాణ్‌రామ్ మ‌ల్టీస్టార‌ర్.. డైరెక్ట‌ర్ కూడా...

నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ… బాల‌య్య – క‌ళ్యాణ్‌రామ్ మ‌ల్టీస్టార‌ర్.. డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌..!

నంద‌మూరి అభిమానులు నంద‌మూరి ఫ్యామిలీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా కోసం గ‌త కొన్నేళ్లుగా వెయిట్ చేస్తూనే వ‌స్తున్నారు. బాల‌య్య‌, ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ ముగ్గురు హీరోలు నంద‌మూరి ఫ్యామిలీ నుంచి ఉన్నారు. ఈ ముగ్గురిలో క‌నీసం ఏ ఇద్ద‌రు హీరోలు క‌లిసి సినిమా చేసినా చూడాల‌న్న‌దే వారి కోరిక. అయితే వారి కోరిక ప‌దిహేనేళ్లుగా తీర‌డ‌మే లేదు. ఎన్టీఆర్ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ చిన్న రోల్ చేయ‌డం.. ఇక క‌ళ్యాణ్‌రామ్ బ్యాన‌ర్లో ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ చేయ‌డం మిన‌హా నంద‌మూరి కాంబినేష‌న్లు సెట్ కావ‌డం లేదు.

అయితే ఎట్ట‌కేల‌కు నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్ సెట్ అయిపోయింది. నంద‌మూరి అభిమానులు పండ‌గ చేస్కోవ‌చ్చు. న‌ట‌సింహం బాల‌కృష్ణ – క‌ళ్యాణ్‌రామ్ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్‌ను ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సెట్ చేస్తున్నారు. వ‌రుస విజ‌యాల‌తో అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అనిల్ రావిపూడి ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతోంది. ఎఫ్ 2 లాంటి సూప‌ర్ హిట్ కొట్టిన అనిల్ ఆ త‌ర్వాత మ‌హేష్‌బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి సూప‌ర్ హిట్ సినిమా తీశాడు. పైగా ఈ సినిమా అల వైకుంఠ‌పురంలో సినిమాకు పోటీగా వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో అనిల్ క్రేజ్ మ‌రింత‌గా పెరిగింది.

ఇక అనిల్ రావిపూడికి డైరెక్ట‌ర్‌గా లైఫ్ ఇచ్చింది క‌ళ్యాణ్‌రామే. క‌ళ్యాణ్‌రామ్ హోం బ్యాన‌ర్లో వ‌చ్చిన ప‌టాస్ సినిమాతో అనిల్ రావిపూడి డైరెక్ట‌ర్ అయ్యాడు. ఆ కృత‌జ్ఞ‌త అనిల్‌కు ఎప్పుడూ ఉంటుంది. ఆ త‌ర్వాత మ‌రోసారి అనిల్ – క‌ళ్యాణ్ క‌లిసి ప‌ని చేయాల‌ని అనుకున్నా ఎవ‌రి షెడ్యూల్స్‌లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇక బాల‌య్య తో క‌లిసి ప‌ని చేయాల‌ని అనిల్ రావిపూడి రెండేళ్లుగా ట్ర‌య‌ల్స్‌లో ఉన్నారు. మ‌ధ్య‌లో రామారావు గారు పేరుతో ఓ క‌థ చెప్పారు.. బాల‌య్య చిన్న చిన్న మార్పులు చెప్పారు. ఎందుకో గాని ఆ సినిమా ప‌ట్టాలు ఎక్క‌లేదు.

ఇటీవ‌ల అన్‌స్టాప‌బుల్ షోకు వ‌చ్చిన‌ప్పుడు బాల‌య్యే అనిల్‌తో సినిమా ఉంటుంద‌ని డైరెక్టుగా క్లారిటీ ఇచ్చేశారు. అనిల్ ప్ర‌స్తుతం చేస్తోన్న ఎఫ్ 3 సినిమా ముగిసిన వెంట‌నే బాల‌య్య సినిమా కోసం క‌స‌ర‌త్తులు చేస్తాన‌ని చెప్పాడు. అయితే ఇంత‌లో మ‌రో ట్విస్ట్‌.. ఇది మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా వ‌స్తోంది. ఈ సినిమాలో మ‌రో హీరో న‌టిస్తున్నాడు.. ఆ హీరో ఎవ‌రో కాదు అనిల్ తొలి సినిమా హీరో క‌ళ్యాణ్‌రామ్‌.

ఈ మ‌ల్టీస్టార‌ర్ కాంబినేష‌న్ సెట్ చేసేందుకే ముందుగా బాల‌య్య‌తో అనుకున్న రామారావు గారు సినిమా స్టోరీని ప‌క్క‌న పెట్టేసి.. మ‌రో కొత్త క‌థ రెడీ చేస్తున్నాడ‌ట‌. ఎఫ్ 3 కంప్లీట్ అయ్యాక‌.. ఈ లోగా బాల‌య్య – మ‌లినేని సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంది. అయితే ఈ సినిమా అనిల్ స్టైల్లో బాగా కామెడీ డోస్‌లో ఉంటుంది.. అంతే స‌మ‌పాళ్ల‌లో యక్ష‌న్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే ఇందులో క‌ళ్యాణ్‌రామ్ రోల్ ఎలా ? ఉంటుంది ? ఏంట‌న్న‌ది ఇంకా క్లారిటీ రావాలి. ఏదేమైనా నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్ నంద‌మూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news