Moviesసీనియ‌ర్ ఎన్టీఆర్ ఈ ఫొటో వెన‌క ఇంత స్పెషాలిటీ ఉందా.. (...

సీనియ‌ర్ ఎన్టీఆర్ ఈ ఫొటో వెన‌క ఇంత స్పెషాలిటీ ఉందా.. ( ఫొటో)..!

టాలీవుడ్ న‌ట‌సౌర్వ‌భౌమ న‌ట‌రత్న ఎన్టీఆర్ త‌న న‌ట‌న‌తో కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. అది పౌరాణికం అయినా, సాంఘీకం, జాన‌ప‌దం, చారిత్ర‌కం ఏది అయినా కూడా ఎన్టీఆర్ న‌ట‌న‌కు వంక పెట్ట‌లేం. ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి ఉంటారు. ఎన్టీఆర్ కెరీర్‌లో ప్లాపులు చాలా త‌క్కువు.. ఆయ‌న న‌టించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజ‌యాలే ఉన్నాయి. ఎన్టీఆర్ మ‌ర‌ణించి ఇప్ప‌టికే రెండున్న‌ర ద‌శాబ్దాలు అవుతోంది. ఇప్ప‌ట‌కీ ఈ త‌రం జ‌న‌రేష‌న్లో ఉన్న వారు కూడా ఎన్టీఆర్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు.

అటు సినిమాల్లో మాత్ర‌మే కాదు.. ఇటు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కూడా ఇక్క‌డ కూడా స‌క్సెస్ అయ్యి ఎన్టీఆర్ హిట్ కొట్టారు. ఓ ప్రాంతీయ పార్టీగా పుట్టిన తెలుగుదేశం జాతీయ రాజ‌కీయాల్లో ఎన్ని సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఎన్టీఆర్‌కు సంబంధించి ఎన్నో అపురూప జ్ఞాప‌కాలు ఉన్నాయి. ప్ర‌స్తుత సోష‌ల్ మీడియా యుగంలో ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు వాటిని అప్పుడ‌ప్పు బ‌య‌ట‌కు తీస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఇవి నెట్టింట్లో వైర‌ల్ అవుతూ ఉంటాయి.

తాజాగా ఎన్టీఆర్ ఫొటో ఒక‌టి నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోకు చాలా ప్ర‌త్యేక‌త ఉంది. ఈ ఫొటో ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన సినిమా పేర్ల‌తో గీసిన ఫొటో కావ‌డం విశేషం. ఈ ఫొటో ఎన్టీఆర్‌, నంద‌మూరి అభిమానులు విప‌రీతంగా వైర‌ల్ చేస్తున్నారు. ఒక్క ఫొటోలో ఎన్టీఆర్ న‌టించిన అన్ని సినిమాల పేర్ల‌ను చాలా చ‌క్క‌గా కూరుస్తూ ఈ ఫొటో గీసిన తీరు అద్భుతంగా ఉంది.

ఎన్టీఆర్ 1923లో మే నెల‌లో కృష్ణా జిల్లా నిమ్మ‌కూరులో జ‌న్మించారు. 1996లో ఆయ‌న మృతి చెందారు. ఇక ఎన్టీఆర్ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కే రెండు క‌ళ్లు లాంటి వారు. ఆయ‌న వేసిన బ‌ల‌మైన పునాదితోనే ఈ రోజు ఆ వంశంలో రెండో త‌రం హీరోగా వ‌చ్చిన బాల‌కృష్ణ ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా తిరుగులేని విజయాలు సాధిస్తూ స్టార్ హీరోగా ఉన్నారు. తండ్రి స్టైల్లోనే సాంఘీక‌, పౌరాణిక‌, చారిత్ర‌క‌, జాన‌ప‌ద ఇలా ఏ క‌థాంశంలో అయినా ఇట్టే ఇమిడిపోవ‌డం బాల‌య్య స్టైల్‌.

ఇక మూడో త‌రం హీరోగా వ‌చ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం అచ్చు గుద్దిన‌ట్టు తాత పోలిక‌ల‌తో ఈ త‌రం తార‌క రాముడిగా దూసుకు పోతున్నారు. త‌న వంశం నుంచి వ‌చ్చిన లెగ‌సీని కంటిన్యూ చేస్తే అన్ని క‌థాంశాల‌లోనూ న‌టిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news