Moviesఏపీ, తెలంగాణ‌లో ' పుష్ప ' ఫ‌స్ట్ షో ప‌డేది అక్క‌డే.....

ఏపీ, తెలంగాణ‌లో ‘ పుష్ప ‘ ఫ‌స్ట్ షో ప‌డేది అక్క‌డే.. వాళ్ల‌కే ఆ ల‌క్కీ ఛాన్స్‌..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్‌ మూవీ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. శుక్రవారం థియేటర్ల లోకి దిగుతున్న ఈ సినిమా ప్రమోషన్లు ఒక రేంజ్ లో ఉన్నాయి. అల వైకుంఠ పురం లో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ మార్కెట్ … బన్నీ క్రేజ్ ఎలా ?పెరిగిందో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే గతంలో బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 హిట్ అవడంతో పుష్ప సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. ఇక పుష్ప టీజర్ – ట్రైలర్ – సింగిల్ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి.

సమంత చేసిన ఐటమ్ సాంగ్ కూడా సినిమాకు చాలా ప్లస్ గా ఉంది. పుష్ప థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సినీ అభిమానులు పుష్ప కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక పుష్ప సినిమా ఫస్ట్ షో ఎక్కడ పడుతుంది అన్నది కూడా ఇప్పుడు సినిమా వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఏపీలో ఎలాగూ బెనిఫిట్ షో లు లేవు. తెలంగాణలో మాత్రం కొన్ని ఏరియాల్లో ఉదయం ఆరు గంటల నుంచే బెనిఫిట్ షోలు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని కూకట్‌ప‌ల్లి భ్రమరాంబ – మల్లికార్జున థియేటర్ల‌లో పుష్ప ఫస్ట్ షో పడుతుందని తెలుస్తోంది. ఇటీవల బాలయ్య అఖండ‌ సినిమా ఫస్ట్ షో కూడా ఈ రెండు థియేటర్లలోనే వేశారు.

పుష్ప అఫీషియల్ ప్రీమియర్ షో కూడా ఇదే అని చెబుతున్నారు. సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ .. సినిమా యూనిట్‌లో కొంద‌రు ఉదయం నాలుగు గంటలకు పడే ఈ షో చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న పుష్ప ఏం చేస్తుందో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news