Moviesబిగ్ బ్రేకింగ్‌: పుష్ప రిలీజ్ 23కు వాయిదా.. షాక్‌లో బ‌న్నీ ఫ్యాన్స్‌

బిగ్ బ్రేకింగ్‌: పుష్ప రిలీజ్ 23కు వాయిదా.. షాక్‌లో బ‌న్నీ ఫ్యాన్స్‌

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న‌ జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప‌ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ ఎంతో ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో పాటు… బన్నీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. బ‌న్నీ కెరీర్‌లో భారీ ప్రి రిలీజ్‌ బిజినెస్ జరిగిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని పాటలు యూట్యూబ్ ను ఒక ఊపు ఊపేస్తున్నాయి.

ఇక సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. పుష్ప థియేటర్లలోకి వచ్చేందుకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న సమయంలో… పెద్ద షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పుష్ప‌ రేపు రిలీజ్ కావడం లేదు. ఈ నెల 17వ తేదీన పుష్ప రిలీజ్ అని… ప్రేక్షకుల దృష్టి ఉండగా… ఇప్పుడు పుష్ప డిసెంబర్ 23న విడుదల చేస్తున్నట్టు చిత్ర టీం అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదని… ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని చెప్పారు. దీంతో ఒక్కసారిగా బ‌న్నీ ఫ్యాన్స్‌ షాక్ లోకి వెళ్ళిపోయారు. ఇదంతా నిజం అయితే పుష్ప రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇది మనదేశంలో కాదు సింగపూర్ లో..! సింగపూర్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో పుష్ప సినిమాను ఈ నెల 23వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.

ఇక మిగిలిన దేశాలలో మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందని ప్రకటించారు. దీంతో సింగపూర్ లో ఉన్న బన్నీ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారు. బన్నీ కెరీర్లో తొలిసారి భారీ పాన్ ఇండియా సినిమాగా వ‌స్తోన్న పుష్ప‌ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు… తమిళనాడు – కేరళ – కర్ణాటక తో పాటు హిందీ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని కలలు కంటున్న బ‌న్నీ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news