Moviesవిడాకులు తీసుకున్న టాప్ సెల‌బ్రిటీలు వీళ్లే..!

విడాకులు తీసుకున్న టాప్ సెల‌బ్రిటీలు వీళ్లే..!

బాలీవుడ్‌లో ప్రేమ‌లు, పెటాకులు, బ్రేక‌ప్‌లు మ‌నం చాలా కామ‌న్‌గా చూస్తూ ఉంటాం. అయితే కోలీవుడ్‌, టాలీవుడ్‌.. ఇంకా చెప్పాలంటే సౌత్‌లో ఇవి త‌క్కువుగా జ‌రుగుతూ ఉంటాయి. అయితే సౌత్‌లోనూ ఎంతో మంది సినీ సెల‌బ్రిటీలు ప్రేమ‌లు, పెళ్లిల్లు, బ్రేక‌ప్‌లు, విడాకులు తీసుకున్నారు. ఇటీవ‌లే బాలీవుడ్‌లో స్టార్ హీరో అమీర్ ఖాన్ త‌న భార్య కిర‌ణ్‌రావుకు విడాకులు ఇచ్చారు. ఒక్క‌సారి సౌత్‌లో చూస్తే మేటి న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ వాణీ గ‌ణ‌ప‌తి, సారిక‌ల‌ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. త‌ర్వాత గౌత‌మితో స‌హ‌జీవ‌నం చేసి ఆమెకు బ్రేక‌ప్ చెప్పేశాడు.

 

తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు పెళ్లిళ్లు చేసుకుని ఆ భార్య‌ల‌కు విడాకులు ఇచ్చి ఇప్పుడు మూడో పెళ్లి చేసుకున్నాడు. మంచు మ‌నోజ్ సైతం ఇటీవ‌ల త‌న భార్య‌కు విడాకులు ఇచ్చాడు. ఇక ఇప్పుడు అక్కినేని మ‌న‌వ‌డు నాగ‌చైత‌న్య కూడా త‌న భార్య స‌మంత‌కు విడాకులు ఇచ్చాడు. ఇక నాగార్జున సైతం త‌న మొద‌టి భార్య శ్రీల‌క్ష్మికి విడాకులు ఇచ్చాడు.

ఇలా సెల‌బ్రిటీలు త‌ర‌చూ విడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఈగో క్లాష్ అవ్వ‌డం. చైతు – సామ్ విష‌యంలో అదే జ‌రిగింద‌ని అంటున్నారు. ఇక ఇటీవ‌ల యువ జంట‌ల‌కు ఓపిక త‌క్కువుగా ఉంటుంది. ప్ర‌తి విష‌యానికి వారు చికాకు ప‌డుతున్నారు. అయితే విడిపోయాక కొద్ది రోజులు గ‌డిచాక కాని.. వారికి తాము చేసిన త‌ప్పేంటో తెలిసి రాద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news