Moviesజూబ్లిహిల్స్‌లో ప‌వ‌న్ కొత్త ఇంటికి అన్ని కోట్లు పెట్టాడా..!

జూబ్లిహిల్స్‌లో ప‌వ‌న్ కొత్త ఇంటికి అన్ని కోట్లు పెట్టాడా..!

ప్రముఖ నటుడు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ జూబ్లిహిల్స్‌లో ఖ‌రీదైన బంగ్లా కొన్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌నోడికి ఇప్ప‌టికే నందినీ హిల్స్‌లో విలాస వంత‌మైన ఇళ్లు ఉంది. జ‌ర్న‌లిస్టు కాల‌నీ జంక్ష‌న్‌కు స‌మీపంలోనే ఈ ఇళ్లు ఉంది. అయితే ఇప్పుడు హైద‌రాబాద్‌లోనే అత్యంత విలాస‌వంత‌మైన ప్రాంతం అయిన జూబ్లిహిల్స్‌లో బంగ్లా కొన‌డం అంటే మామూలు విష‌యం కాదు… చాలా ఖ‌ర్చు పెట్టాల్సిందే..!

ఈ భ‌వ‌నం కోసం ప‌వ‌న్ ఏకంగా రు. 12 కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ కొత్త ఇళ్లు మొత్తం 6350 గ‌జాల్లో విస్త‌రించి ఉంద‌ట‌. ఇందు కోసం స్టాంప్ డ్యూటీ రూ.18 లక్షలు – బదిలీ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.6 లక్షలు – మ్యూటేషన్ ఛార్జీలు రూ .1.2 లక్షలు చెల్లించాడ‌ని తెలుస్తోంది. ఈ ఇంటి కొనుగోలు ఒప్పందం సెప్టెంబర్ 23 2021న నమోదు చేయబడింది.

క‌రోనా త‌ర్వాత సెల‌బ్రిటీల ఆలోచ‌న‌ల్లో కూడా మార్పు వ‌స్తోంది. వీరు త‌క్కువ జ‌న‌సాంద్ర‌త ఉండే ప్రాంతాల్లో ఉండేందుకు ఎక్కువుగా ఇష్ట‌ప‌డుతున్నారు. అందుకే హైద‌రాబాద్‌లో బ‌డా బ‌డా వాళ్లంతా న‌గ‌రానికి 50 కిలోమీట‌ర్ల దూరంలో ఫామ్‌హౌస్‌లో లేదా, వ్య‌క్తిగ‌తంగా ప్ర‌శాంతంగా ఉండే ఇళ్లో కొనేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఇక ప‌వ‌న్ న‌టిస్తోన్న రెండు సినిమాలు ప్ర‌స్తుతం లైన్లో ఉన్నాయి.

భీమ్లా నాయ‌క్ త‌ర్వాత క్రిష్ డైరెక్ట్ చేసే హరి హర వీర మల్లు ఆ త‌ర్వాత భవదీయుడు భగత్ సింగ్ లైన్లో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news