Gossipsఆ తమిళ హీరోకి అప్పుడే అంత బలుపా..మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్..?

ఆ తమిళ హీరోకి అప్పుడే అంత బలుపా..మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్..?

విజయ్ సేతుపతి.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. తమిళ స్టార్ అయినటువంటి విజయ్ సేతుపతి.. హీరోగా కంటే విలన్ గానే బాగా మెప్పిస్తున్నాడు అని అంటున్నారు అందరు.విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు అన్నట్లుగా తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఉప్పెన సినిమాతో తెలుగు హీరోలను బాగా ఆకట్టుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమా లో ఉండే విధంగా కొందరు హీరోలు, నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారట.

అయితే.. ఈ తమిళ హీరో పై నందమూరి బాలయ్య ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే..బాలకృష్ణ త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు కంప్లీట్ కావడంతో ఈ సినిమాలో విలన్ రోల్ కోసం విజయ్ సేతుపతిని అప్రోచ్ అయితే.. దానికి విజయ్ ‘నో’ చెప్పారనే వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.

దీంతో నందమూరి అభిమానులకు కోపం వచ్చింది. రెండేళ్ల కింద సైరా సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఈ తమిళ హీరో విజయ్ కి..బాలయ్య సినిమాలో నటించడానికి అంత బలుప అని మండిపడుతున్నారు. నెట్టింట ఆయన్ని ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news