Moviesటాలీవుడ్ లో రూ.100 అడ్వాన్స్‌ తీసుకున్న డైరెక్టర్ ఇతనే..!!

టాలీవుడ్ లో రూ.100 అడ్వాన్స్‌ తీసుకున్న డైరెక్టర్ ఇతనే..!!

ఏంటి.. రూ.100 అడ్వాన్స్‌ గా తీసుకుంటాడా.. అది కూడా సినిమా డైరెక్టర్ నా అసలు నమ్మడం లేదు కదా.. మీకు వినడానికి విచిత్రంగా ఉన్నా.. చదవడానికి విడ్డురంగా ఉన్నా..ఇది నిజం. ఈ డైరెక్టర్ కేవలం రూ.100 అడ్వాన్స్‌ తీసుకుంటాడట.. ఆయన మరేవరో కాదు.. దర్శకుడు త్రినాథరావు నక్కిన…

మేం వయసుకు వచ్చాం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన దర్శకుడు త్రినాథరావు నక్కిన..వరుసగా బిగ్గెస్ట్ సినిమా లను చేస్తూ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. సినిమా చూపిస్తా మావ సినిమా తర్వాత నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో నేను లోకల్ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత వెను దిరిగి చూసుకోకుండా ఏడాదికి ఒక సినిమా చొప్పున చేస్తూనే ఉన్నాడు.

అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వాళ్ళు గతంలో అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇక చివరగా రామ్ తో ‘హలో గురు ప్రేమకోసమే’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈయన వరుసగా పెద్ద హీరోలతో కూడా సినిమా లు చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

అయితే ఈయన గురించి ఓ వార్త నెట్టింట ఆసక్తిగా మారింది. అది ఏంటంటే .. ఈ దర్శకుడికి అడ్వాన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదట. కొందరైతే అడ్వాన్స్ తీసుకోమ్మని బ్రతిమాలితే వారిని నొప్పించకుండా 100రూపాయలు తీసుకున్నట్లు.. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. కథ ఓకే కాకుండానే ఈయన కు సినిమాలకు అడ్వాన్స్ లు తీసుకోవడం ఇష్టం ఉండదట. అందుకే ఈయన నిర్మాతలకు నమ్మకం కలిగించేందుకు అని వంద రూపాయలు మాత్రమే అడ్వాన్స్ గా తీసుకుంటాడట. ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా కూడా నిజమే అంటూ ఆయన సన్నిహితులు కూడా అంటూ ఉన్నారు.

ఇక ఈ డైరెక్టర్ టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. అయితే వెంకటేశ్ వరుసగా నారప్ప, ఎఫ్ 3, దృశ్యం సినిమాలను కమిటవడం వల్ల ఆలస్యం అయింది. ఇదే కాకుండా గత ఏడాది నుంచి కరోనా వెంటాడుతుండటంతో కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ అనౌన్స్ అవలేదు. ఈ క్రమంలో దర్శకుడు త్రినాథ రావు ప్రాజెక్ట్స్ కూడా ఏవీ మొదలవలేదు. వెంకీతో మాత్రమే కాకుండా ఈ డైరెక్టర్మా మాస్ మహారాజ రవితేజతో కూడా ఓ ప్రాజెక్ట్ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news