Moviesఈ క్యూట్ కృష్ణ.. ఇప్పుడు టాలీవుడ్ నెం.1 హీరో..!!

ఈ క్యూట్ కృష్ణ.. ఇప్పుడు టాలీవుడ్ నెం.1 హీరో..!!

ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు. ఇక వారికీ సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే సాధారణంగా హీరోస్ ప్రస్తుతం ఎలా ఉన్నారో చూస్తున్నాం.. కానీ వారు చిన్నప్పుడు ఎలా ఉంటారో అని ప్రతి ఒకరికి తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే ఓ హీరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తాజాగా సోషల్ మీడియాలో కృష్ణుడు గెటప్ లో నవ్వుతూ ఫోటోకి ఫోజులు ఇస్తున్న ఈ చిన్నారి హీరో ఎవరో గుర్తుపట్టారా. ఈ చిన్నారి హీరోని గుర్తు పట్టడం కష్టం అంటారా? సరే మీకోసం ఈ ఫోటోకి సంబంధించి క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో ఒక్కసారి చూద్దాం. ఈ ఫొటోలో ఉన్నది ఓ స్టార్‌ హీరో.. ఆరు అడుగుల అందగాడు. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర వీరుడు. ఇక ఈ క్లూతో అయినా ఈ చిన్నారి హీరోని గుర్తించారా?.. యస్…మీరు అనుకున్నది నిజమే.. ఈ ఫోటోలో ఉన్నది మన డార్లింగ్ ప్రభాస్..

ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్‌లా దూసుకుపోతున్న మిస్టర్ పర్‌ఫెక్ట్. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్‌కు డార్లింగ్. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి.

ఒక పక్క మిస్టర్ ఫర్ఫెక్ట్‌గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తూనే.. మరో పక్క మిర్చిలా రికార్డుల ఘాటును పెంచాడు. రెబల్ స్టార్ ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్‌లో కనిపించడానికి ప్రయత్నిస్తాడు. ‘ఈశ్వర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ‘ఛత్రపతి’తో యాక్షన్ హీరోగా…‘బుజ్జిగాడు’తో మాస్ హీరోగా అలరించి…‘బాహుబలి’తో హాలీవుడ్ వరకూ తన సత్తా చాటాడు ప్రభాస్.

ఈ ఘాటు మిర్చి అంటే అమ్మాయిలకి చెప్పలేనేంత పిచ్చి.. అబ్బాయిలకు అనుచుకోలేనంత అసూయ.. దర్శకులకి బాగా నచ్చే డార్లింగ్.. నిర్మాతలకి డబ్బుల వర్షం కురిపించే మిస్టర్ పర్ఫెక్ట్.. ప్రేక్షకులతొస్ సాహో అనిపించుకున్నారు ప్రభాస్

టాలీవుడ్ లోకి ‘ఈశ్వర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ వర్షం,ఛత్రపతి,డార్లింగ్ వంటి సినిమాలు ప్రభాస్ రేంజ్ ని ఒక లెవల్ కి తీసుకువెళ్ళితే ‘బాహుబలి’ మరొక మెట్టు ఎక్కించింది. దర్శక ధీరుడు రాజమౌళికి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసే సత్తా, విజన్ ఉన్నాయి. కానీ అందుకు తగ్గ కటౌట్ కావాలిగా. ఆ కటౌట్ పేరు ప్రభాస్.

వీరిద్దరూ కలిసి వెండితెరపై అద్భుత దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించారు. బాహుబలితో తెలుగు సినిమా గొప్పతనాన్ని దశదిశలా విస్తరించారు. అందరి హీరోల అభిమానులు ప్రభాస్ అభిమానులే. ప్రభాస్ మనసు వెన్న.. అందుకే ఆయన సెట్ అసిస్టెంట్ నుంచి, ఇండియా టాప్ డైరెక్టర్‌ వరకు అందర్నీ డార్లింగ్ అని పిలుస్తారు. కాగా ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news