Moviesరాధే శ్యామ్ ఓటీటీ డీల్ క్లోజ్‌... బంప‌ర్ ఆఫ‌ర్‌ను మించి..!

రాధే శ్యామ్ ఓటీటీ డీల్ క్లోజ్‌… బంప‌ర్ ఆఫ‌ర్‌ను మించి..!

బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. ఆ త‌ర్వాత సాహో సినిమా కూడా ప్ర‌భాస్‌కు నార్త్‌లో మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నారు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమాకు యూర‌ప్ నేప‌థ్యంలో వేసిన ఓ సెట్ హైలెట్ అంటున్నారు. ఈ సినిమాపై మ‌మూలు అంచ‌నాలు లేవు. బిజినెస్ కూడా హాట్ కేకులా అమ్ముడు పోతోంది.

ఇక ఈ సినిమాకు ఓటీటీ డీల్ క్లోజ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా అన్ని భాషల హక్కులు అన్నీ జీ5 వారే కొనుగోలు చేసిన‌ట్టు స‌మాచారం. ఇంకా సినిమా షూటింగ్ ముగియ‌కుండానే ఈ డీల్ క్లోజ్ అవ్వ‌డం నిర్మాత‌లు ఫుల్ ఖుషీగా ఉన్నార‌ట‌. ఈ డీల్ రేటు ఎంత‌నేది తెలియ‌దు కాని.. సాహోను మించే ఉంద‌ని అంటున్నారు. జీ 5 ఇంత‌కు ముందే రాధే శ్యామ్ డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు భారీ ఆఫ‌ర్ ఇచ్చినా.. చివ‌ర‌కు వాళ్లు డిజిట‌ల్ రైట్స్ సొంతం చేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news