Moviesసమంతతో బెడ్ రూమ్ సీన్స్.. హీరో హాట్ కామెంట్స్..!!

సమంతతో బెడ్ రూమ్ సీన్స్.. హీరో హాట్ కామెంట్స్..!!

సమంత అక్కినేని తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ప్రస్తుతం సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 అనే ఈ పాపులర్ వెబ్ సిరీస్‌ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ 2 సీరిస్‌లో.. సమంత రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.

రాజీ పాత్రలో ఆమె నటన దాదాపు అందరికీ నచ్చేసింది. రాజీ పాత్రలో సమంత ఇరగదీసిందనే చెప్పోచ్చు. దీంతో ప్రేక్షకుల నుంచే కాక సహ నటులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన నటనతో పాటు డైలాగ్ డెలివరీ, ఆ పాత్ర కోసం సమంత ఫిట్ నెస్‌, డీ గ్లామర్ లుక్‌లో సమంత అక్కినేని తన పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఇందులో సమంత పాత్రపై తమిళనాడులో కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో సమంత తనతో కొన్ని శృంగార సన్నివేశాల్లో నటించారని సహ నటుడు షాహబ్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరి మధ్య కొన్ని శృంగార సన్నివేశాలు చిత్రీకరించారని.. కానీ వాటిని ఎడిటింగ్‌లో తొలగించారని షాహబ్ అలీ తెలిపారు.

సినిమాల్లో, సిరీస్ ల విషయంలో ఇది పెద్ద విషయం కాదని.. తప్పనిసరి అనుకుంటే తప్ప కొన్ని సీన్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తారని చెప్పుకొచ్చారు. అలా.. సమంత, షాహబ్ అలీ మధ్య జరిగిన బెడ్ రూమ్ సీన్స్ ను తొలగించారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news