Moviesసునీల్ క‌న‌బ‌డుట‌లేదు... స‌స్పెన్స్ టీజ‌ర్ ( వీడియో)

సునీల్ క‌న‌బ‌డుట‌లేదు… స‌స్పెన్స్ టీజ‌ర్ ( వీడియో)

క‌మెడియ‌న్‌, హీరో సునీల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన సినిమా క‌న‌బ‌డుట‌లేదు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ఎం. బాల‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ రోజు ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. సునీల్ డిటెక్టివ్ గా న‌టిస్తోన్న ఈ సినిమా టీజ‌ర్లో ఓ మ‌హా న‌గ‌రంలో జ‌రుగుతోన్న వ‌రుస హ‌త్య‌లు, నిందితుడి కోసం పోలీసుల గాలింపు… వీరి మ‌ధ్య‌లో ఈ కేసును టేకోవ‌ర్ చేసే ఓ డిటెక్టివ్ క‌థాంశంతో సినిమా ఉంటుంద‌ని టీజ‌ర్ చెప్పేసింది. సిటీలో వ‌రుస హ‌త్య‌ల‌కు ముసుగు ధ‌రించిన వ్య‌క్తి లింక్ ఏంట‌నేది మాత్రం తెలియ‌కుండా స‌స్పెన్స్‌లో పెట్టారు.

ఈ రోజుల్లో ప్రేమ పెళ్లి అడ‌వాళ్ల‌కు సెక్యూరిటీ ఇస్తుంది.. అదే మ‌గ‌వాళ్ల‌కు ఇన్ సెక్యూరిటీ ఇస్తుంది అనే డైలాగ్ టీజ‌ర్‌కు హైలెట్ అయ్యింది. ఇక వ‌రుస ప్లాపుల‌తో ఉన్న సునీల్ క‌నీసం ఈ సినిమాతో అయినా హిట్ కొట్టి ట్రాక్‌లోకి వ‌స్తాడేమో చూడాలి. ఓవ‌రాల్‌గా టీజ‌ర్ అయితే స‌స్పెన్స్ గా ఉంది. మ‌రి సినిమా ఎలా ఉంటుందో ? చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news