Moviesహాట్ యాంక‌ర్‌ ప్రేమ కోసం నానా పాట్లు పడుతోన్న జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్.....

హాట్ యాంక‌ర్‌ ప్రేమ కోసం నానా పాట్లు పడుతోన్న జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్.. !

బుల్లితెర‌పై ఎన్ని కామెడీ షోలు వ‌చ్చినా జ‌బ‌ర్ద‌స్త్ రూటు ప్ర‌త్యేకం. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోకు ఉన్న క్రేజ్ ఏ షోకు లేదు. ఇప్ప‌టికే ఎన్నో బుల్లితెర షోలు వ‌చ్చినా జ‌బ‌ర్ద‌స్త్‌కు ఉన్న టీఆర్పీ రేటింగ్‌లు, క్రేజ్ మిగిలిన షోల‌కు లేవ‌నే చెప్పాలి. ఈ షో ఎంతో మంది క‌మెడియ‌న్ల‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసింద‌నే చెప్పాలి. తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ స్కిట్‌లో హైప‌ర్ ఆది ప్రేమ‌లో ఫెయిల్ అయిన వ్య‌క్తిలా ఎవ‌రి కోసం పాట పాడుతూ ఎంట్రీ ఇచ్చాడు.

 

వెంట‌నే అన‌సూయ లేచి వెళ్లిపోతుండ‌గా ఎక్క‌డికి అని అడుగుతాడు. వెంట‌నే అన‌సూయ నీ కంటికి క‌నిపించుకుండా వెళ్లిపోతాన‌ని చెప్ప‌గా… హైప‌ర్ ఆది వెంట‌నే కారేవ్యాన్‌లోకి వెళ్లి కాజు బిర్యానీ తిన‌డానికి అని చెప్పొచ్చుగా అని కౌంట‌ర్ వేస్తాడు. నాకు ఆక‌లి వేస్తుంద‌ని ఎలా తెలుసు అని అన‌సూయ ప్ర‌శ్నించ‌గా ఆక‌లేయ‌క‌పోతే అన‌సూయ అంద‌రి ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తుంద‌ని.. ఆకలేస్తే త‌న ఎక్స్‌ప్రెష‌న్స్ కూడా ఇవ్వ‌ద‌ని చెప్పాడు.

 

అన్నీ మ‌ర్చిపోయి క‌లిసి ఉందాం వ‌చ్చేయ్ అని ఆది అంటే వెంట‌నే అన‌సూయ నువ్వు మ‌ర్చిపోయినా నేను మత్రం మ‌ర్చిపోన‌ని చెపుతుంది. వెంట‌నే అన‌సూయ ఆది చాలా మారిపోయాడ‌ని చెపితే.. వెంట‌నే ఆది అన‌సూయ‌నే త‌న విష‌యంలో మారిపోయాడ‌ని కౌంట‌ర్ వేసింది. ప్ర‌స్తుతం ఈ స్కిట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news