Moviesజీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు క‌రోనా పాజిటివ్‌

జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు క‌రోనా పాజిటివ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి  దెబ్బ‌తో సెల‌బ్రిటీలు విల‌విల్లాడుతున్నారు. సెల‌బ్రిటీలే ఏదో ఒక ప‌ని నేప‌థ్యంలో బ‌య‌ట‌కు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే వారిని క‌రోనా వెంటాడుతోంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది సినిమా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన వారే కాకుండా పారిశ్రామిక రంగాల‌కు చెందిన ప‌లువురు క‌రోనా భారీన ప‌డుతున్నారు. వీరిలో కొంద‌రు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

 

ఇక తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు ఇప్ప‌టికే క‌రోనా భారీన ప‌డ్డారు. ఇప్పుడు ఈ లిస్టులో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తులు కూడా చేరారు. జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వారం రోజుల క్రితమే కరోనా సోకినప్పటికీ ఈ విషయం ఆలాస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీరు హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. ఇక ఇటీవ‌ల మిల్కీబ్యూటీ త‌మ‌న్నా సైతం క‌రోనా భారీన ప‌డి కోలుకున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news