Moviesజ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి అంత్య‌క్రియ‌ల‌కు కుమారుడు దూరం... క‌రోనాతో హాస్ప‌ట‌ల్లో చికిత్స‌

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి అంత్య‌క్రియ‌ల‌కు కుమారుడు దూరం… క‌రోనాతో హాస్ప‌ట‌ల్లో చికిత్స‌

ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయ‌న ఈ రోజు తెల్ల‌వారు ఝామున గుంటూరులోని త‌న స్వ‌గృహంలోనే క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణవార్త తెలుసుకున్న ఆయ‌న స‌న్నిహితులు, ప‌లువురు క‌ళాకారులు గుంటూరులోని విద్యాన‌గ‌ర్లో ఉంటోన్న ఆయ‌న నివాసానికి త‌ర‌లి వెళుతున్నారు. అయితే ఆయ‌న మ‌ర‌ణం రోజే ఆయ‌న కుటుంబం మ‌రింత ఇబ్బందుల్లో ప‌డింది. ఆయ‌న కుమారుడు అంత్య‌క్రియ‌ల‌కు దూరం కావాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఆయ‌న కుమారుడు, కోడ‌లు క‌రోనాతో హాస్ప‌టల్లో చికిత్స పొందుతున్నారు. వెండితెరపైకి రాకముందు ఎస్సైగా పనిచేసిన ఆయన.. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన యాస, నటన, తీరును ఎవరూ భర్తీ చేయలేరన్నది టాలీవుడ్ ఎరిగిన సత్యం. మరోవైపు జయప్రకాష్‌ రెడ్డి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news