Moviesబిగ్‌బాస్ విజేత గంగ‌వ్వే... జోస్యం చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

బిగ్‌బాస్ విజేత గంగ‌వ్వే… జోస్యం చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ప్ర‌స్తుతం ఉన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌లో ఎవ‌రైనా సెన్షేష‌న‌ల్ కంటెస్టెంట్ ఉన్నారా అంటే గంగ‌వ్వే అని చెప్పాలి. బిగ్‌బాస్ తెలుగు వెర్ష‌న్ సీజ‌న్ 4 ఆదివారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. హోస్ట్ నాగార్జున మొత్తం 16 మంది కంటెస్టెంట్ల‌ను హౌస్‌లోకి పంపారు. వీరంద‌రిలోకి వ‌య‌స్సులో పెద్ద‌ది అయిన ముస‌లి గంగ‌వ్వ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. ఇప్ప‌టికే యూట్యూబ్‌లో సంచ‌ల‌నం అయిన గంగ‌వ్వ గురించే పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. బ‌య‌ట అప్పుడే గంగ‌వ్వ ఆర్మీ ర‌చ్చ కూడా స్టార్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ సీజ‌న్లో బిగ్‌బాస్ విజేత గంగ‌వ్వే అని ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. చొప్పందండి ఎమ్మెల్యే సుంకె ర‌విశంక‌ర్ మాట్లాడుతూ మా చొప్ప‌దండి నియోజ‌క‌వ‌ర్గ అవ్వ గంగ‌వ్వ ఈ సారి బిగ్‌బాస్ విజేత అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని.. మారుమూల ప‌ల్లె నుంచి వ‌చ్చిన ఆమె త‌న మాట‌తో, తెలంగాణ ప‌ల్లె యాస‌తో ఎంతో మంది ప్ర‌జ‌ల హృద‌యాలు కొల్ల‌గొట్టింద‌ని.. ఈ సారి గంగ‌వ్వ విజేత అవుతుంద‌ని ట్వీట్ చేశారు. ప‌లువురు గంగ‌వ్వ‌కు శుభాకాంక్ష‌లు చెపుతూ ఆమె ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news