Gossipsస‌మంత కొత్త రేటుతో ఆ డైరెక్ట‌ర్‌కు బొమ్మ క‌న‌ప‌డిందా.... !

స‌మంత కొత్త రేటుతో ఆ డైరెక్ట‌ర్‌కు బొమ్మ క‌న‌ప‌డిందా…. !

అక్కినేని కోడ‌లు పెళ్ల‌య్యాక కాస్త గ్లామ‌ర్ డోస్ తగ్గించి హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్‌తో పాటు జానులాంటి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే న‌టిస్తోంది. స‌మంత‌కు సౌత్‌లో తెలుగు, త‌మిళ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమెతో తాజాగా గేమ్ ఓవర్ ఫేం అశ్విన్ శరవనన్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. శ‌ర‌వ‌న‌న్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో స‌మంత న‌టించేందుకు ఓకే చెప్పింద‌ట‌. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం వెన‌క్కు త‌గ్గ‌న‌ని ఖ‌రాఖండీగా చెప్పేసింద‌ట‌.

మామూలుగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టించే స‌మ‌యంలోనే స‌మంత సినిమాకు రు. 2 కోట్లు తీసుకునేది. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమా అందులోనూ రెండు భాష‌ల్లో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో స‌మంత ఏకంగా రు. 4 కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. అస‌లే ఈ సినిమాను మీడియం బ‌డ్జెట్‌లో తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. అయితే ఇప్పుడు స‌మంత రెమ్యున‌రేష‌న్‌తో ద‌ర్శ‌కుడు శ‌ర‌వ‌న‌న్‌తో పాటు మేక‌ర్స్ షాక్ తిన్నార‌ట‌. అంత ఇచ్చుకోలేమ‌ని డిసైడ్ అయిన నిర్మాత‌లు లాభాల్లో వాటా ఇచ్చే ప‌ద్ధ‌తిపై ఆమెతో చ‌ర్చిస్తున్నార‌ట‌.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news