Newsహైద‌రాబాద్‌లో 32 అమ్మాయిని రేప్ చేసిన 19 ఏళ్ల అబ్బాయి

హైద‌రాబాద్‌లో 32 అమ్మాయిని రేప్ చేసిన 19 ఏళ్ల అబ్బాయి

స‌మాజంలో రేప్‌ల‌కు, లైంగీక దాడుల‌కు వావి వ‌ర‌స‌లు, వ‌య‌స్సు తార‌త‌మ్యాలు అస్సలు ఉండ‌డం లేదు. అమ్మాయిలు కూడా త‌మ‌కంటే ఎంతో చిన్న వాళ్ల‌తోనే ప్రేమ‌లో ప‌డుతున్నారు. ఇక కుర్రాళ్ల‌కు కూడా ఆంటీల‌ను వ‌ల‌లో వేసుకుంటున్నారు. తాజాగా హైద‌రాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ సంచ‌ల‌న సంఘ‌ట‌న జ‌రిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 32 ఏళ్ల యువతిపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. ప్రేమ పేరుతో  స‌ద‌రు యువ‌కుడు త‌న కంటే వ‌య‌స్సులో 13 ఏళ్లు పెద్ద‌ది అయిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి పేరుతో వ‌ల‌లో వేసుకున్నాడు. ఆమెపై ప‌లుమార్లు అత్యాచారం చేశాడు.

ఎర్రకుంట ప్రాంతానికి చెందిన ఈ యువకుడు అదే ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువతిపై కన్నేశాడు. ఆమె వెంటపడి మాయమాటలు చెప్పి లోబ‌ర‌చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆమెపై ప‌లుమార్లు అత్యాచారం చేశాడు. చివ‌ర‌కు ఆమె పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి తేవ‌డంతో త‌ప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఆ యువ‌తి స్థానిక పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ఆ యువ‌కుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు. అయితే దీని వెన‌క ఇత‌ర కార‌ణాలు ఉన్నాయా ? అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news