Gossipsప్ర‌భాస్‌కు చెల్లిగా ఎన్టీఆర్ హీరోయిన్‌..!

ప్ర‌భాస్‌కు చెల్లిగా ఎన్టీఆర్ హీరోయిన్‌..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధేశ్యామ్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత వైజ‌యంతీ మూవీస్ సంస్థ తెర‌కెక్కించే సినిమాలో న‌టిస్తాడు. మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాలు సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో ఉంటాయ‌ని అంటున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణే న‌టిస్తోంది. ఆమెకు ఏకంగా రు. 25 కోట్ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసిన‌ట్టు భోగ‌ట్టా..!

 

ఇక ఈ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలో ప్ర‌భాస్‌కు చెల్లిగా నివేదా థామ‌స్ న‌టిస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నివేద ఎంత మంచి న‌టో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె ఇప్ప‌టికే ఎన్టీఆర్ ప‌క్క‌న జైల‌వ‌కుశ సినిమా చేసింది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ వకీల్ సాబ్‌లో కూడా కీల‌క పాత్ర పోషిస్తోంది.  నాని వి సినిమా చేసింది. సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ చెల్లి రోల్ కోసం నాగ్ అశ్విన్‌కు నివేద అయితేనే పరెఫెక్ట్ అని అనిపించింద‌ని స‌మాచారం.

 

ఇక ఇప్పటికే కొన్ని సినిమాలలో చెల్లిగా నటించిన నివేదా ప్ర‌భాస్ ప‌క్క‌న చెల్లి రోల్ అంటే కాద‌న‌ద‌న్న న‌మ్మ‌కంతోనే నాగ్ ఆమె పేరు ప‌రిశీలిస్తున్నార‌ట‌. అయితే  ఈ రోల్‌కు ఆమె ఇంకా ఓకే చెప్పిందా లేదా ? అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ మాత్రం నివేద‌ను ప్ర‌భాస్ చెల్లిగా చూసేందుకు త‌మ‌కు ఇష్టం లేద‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news