Gossipsపాన్ ఇండియా సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌... ఆ డైరెక్ట‌ర్‌తో రిస్క్ చేస్తున్నాడా..?

పాన్ ఇండియా సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌… ఆ డైరెక్ట‌ర్‌తో రిస్క్ చేస్తున్నాడా..?

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల హ‌వా న‌డుస్తోంది. ప్ర‌భాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ఇలా స్టార్ హీరోలు అంద‌రూ వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. బ‌డ్జెట్ పెంచుకోవడంతో పాటు ఇత‌ర భాష‌ల్లో కూడా త‌మ సినిమాలు రిలీజ్ చేస్తుండ‌డంతో మార్కెట్ పెంచుకునే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మీడియం రేంజ్ హీరోలు కూడా చేరిపోతుండ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మే.

అర్జున్‌రెడ్డి సినిమా బాలీవుడ్‌లో కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ ఒక్క‌సారిగా స్కై రేంజ్‌కు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే విజ‌య్ ప‌క్క‌న ఏకంగా దివంగ‌త‌ అందాల సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీ క‌పూర్ సైతం న‌టిస్తుంద‌న్న టాక్ కూడా వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు విజ‌య్ ఏకంగా ఓ పాన్ ఇండియా సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్వ‌క‌త్వంలో ఫైట‌ర్ సినిమాలో న‌టిస్తోన్న విజ‌య్ ఆ సినిమా త‌ర్వాత మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ పాన్ ఇండియా సినిమా చేయ‌నున్నాడ‌ట‌. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు రు. 80 – 100 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్నార‌ని అంటున్నారు. మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి ప్ర‌స్తుతం నానితో క‌లిసి వి సినిమా చేశాడు.ఈ సినిమా వ‌చ్చే నెల 5న అమోజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతోంది.

విజ‌య్ పాన్ ఇండియా సినిమా చేయ‌డం మంచిదే అయినా… ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అది కూడా మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా రేంజ్ అంటే రిస్కే అంటున్నారు. మ‌రి విజ‌య్ క‌థ‌ను న‌మ్ముకునే ఈ రిస్క్ చేస్తున్నాడా ?  అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news