Moviesబిగ్ బ్రేకింగ్: టాలీవుడ్ డైరెక్టర్ సూర్య కిరణ్ మృతి..ఆ అలవాటే కొంప...

బిగ్ బ్రేకింగ్: టాలీవుడ్ డైరెక్టర్ సూర్య కిరణ్ మృతి..ఆ అలవాటే కొంప ముంచేసిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సూర్యకిరణ్ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. సత్యం డైరెక్టర్గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న సూర్యకిరణ్ బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్లో వన్ ఆఫ్ ద కాన్టెస్టెంట్ గా పాల్గొన్నారు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు .

కాగా కోలీవుడ్ – టాలీవుడ్ ఇండస్ట్రీలలో తనదైన స్టైల్ లో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న సూర్యకిరణ్ మరణించారు అన్న వార్త ఇప్పుడు అభిమానులకి మింగుడు పడడం లేదు. గత కొంతకాలం నుంచి పచ్చకామర్లతో బాధపడుతున్న ఆయనకు సోమవారం గుండెపోటు వచ్చింది అంటూ కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తుంది . సోమవారం ఆయన తృది శ్వాస విడిచినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

తెలుగులో సత్యం , ధన 51, రాజు భాయ్ వంటి సినిమాలకు డైరెక్టర్గా వర్క్ చేసి మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి చిత్రానికి దర్శకత్వం వహించారు . రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు ..దర్శకుడిగా రెండు నంది అవార్డులు అందుకున్న సూర్యకిరణ్ కి బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉందట . ఆ కారణంగా ఆయన అప్పుల పాలు అయ్యాడు అని ..ఆ కారణంగానే కళ్యాణితో విడాకులు తీసుకున్నారు అని ప్రచారం జరుగుతుంది .కాగా సూర్య కిరణ్ మృతి పట్ల పలువురు కోలీవుడ్ – టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news