Movies"సిగ్గులేకుండా అడుగుతున్న..మీరే చెప్పండి".. జగపతి బాబు నోట నుండి ఊహించని మాటలు..!

“సిగ్గులేకుండా అడుగుతున్న..మీరే చెప్పండి”.. జగపతి బాబు నోట నుండి ఊహించని మాటలు..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ చాలా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు . ఏం మాట్లాడుతున్నారు ..? ఎలా మాట్లాడుతున్నారు ..? అసలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది . రీసెంట్గా లెజెండరీ యాక్టర్ జగపతిబాబు మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే జగపతిబాబు ప్రెసెంట్ విలన్ల పొజిషన్లో టాప్ ప్లేస్ లో ఉన్నారు .

నిజానికి జగపతిబాబు కెరియర్లో హీరోగా స్టార్ట్ చేశారు. విబి రాజేంద్రప్రసాద్ ప్రముఖ నిర్మాత ఎన్నో చిత్రాలు నిర్మించారు . ఆయన కొడుకుగా జగపతిబాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు . ఫ్యామిలీ – మాస్- కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వచ్చారు . కానీ జగపతిబాబును అందరూ ఫ్యామిలీ హీరో గానే గుర్తించారు . కొన్ని వందలకు పైగా సినిమాలలో ఆయన నటించి అభిమానులు చేత శభాష్ అనిపించుకున్నారు . ఆ తర్వాత కెరియర్ పరంగా కొన్ని వ్యసనాల కారణంగా ఉన్న ఆస్తిని మంచి ఫ్రెండ్స్ ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .

ఈ విషయాన్ని స్వయాన ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆయనకున్న వ్యసనాల కారణంగా కోట్ల ఆస్తి పోగొట్టుకున్నాను అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు . ఆ తర్వాత మళ్లీ ఎలాగోలా ఇండస్ట్రీలో పలు రోల్స్ దక్కించుకొని కెరీర్ ని ముందుకు తీసుకెళ్లారు . లెజెండ్ సినిమా ద్వారా జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ కెరియర్ నే మార్చేసుకున్నాడు . ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో విలన్ గా చేస్తూ సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జగపతిబాబు రీసెంట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్ట్ చేశారు . ఒక చేతిలో ఎనర్జీ డ్రింక్.. మరొక చేతిలో ఆల్కహాల్ పట్టుకొని ..ఫోటో పోస్ట్ చేస్తూ..” ఎలాగోలా పుట్టేశాను.. ఈ రెండిట్లో ఏది తాగమంటారు మీరే చెప్పండి “అంటూ అభిమానుల్ని క్వశ్చన్ చేశాడు . ఇలా మాట్లాడడం అభిమానులకు షాకింగ్ గా అనిపించింది . జగపతిబాబు మాట్లాడిన విధానాన్ని జనాలు తీసుకోలేకపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం నాటిగా కామెంట్స్ చేస్తున్నారు . రెండు కలిపి తాగే ఓ పని అయిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news