Moviesపబ్లిక్ గా జక్కన్న పరువు తీసేసిన ప్రభాస్.. ఏంటి డార్లింగ్ ఈ...

పబ్లిక్ గా జక్కన్న పరువు తీసేసిన ప్రభాస్.. ఏంటి డార్లింగ్ ఈ అల్లరి(VIDEO)..!!

ప్రభాస్ .. ఆరడుగుల అందగాడు.. ఆ కటౌట్ చూస్తే ఎలాగో ఎలాగో ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి . రెబెల్ స్టార్ ప్రభాస్ పై ఒక్కరంటే ఒక్క డైరెక్టర్ కానీ నటులు కానీ నెగటివ్గా చెప్పిన దాఖలాలు లేవు . అసలు మన ప్రభాస్ లో అలాంటి క్వాలిటీసే లేవు. మంచితనానికి నిలువెత్తు రూపం మన రెబల్ స్టార్. ఈ విషయం కేవలం ప్రభాస్ అభిమానులే కాదు . మిగతా స్టార్ హీరోల అభిమానులు కూడా చెబుతూ ఉంటారు . రీసెంట్ గా ఆయన నటించిన సలార్ సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే .

సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్ళీ అలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. సలార్ సినిమా సక్సెస్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కూడా గ్రాండ్గా చేసుకుంది . ఈ క్రమంలోనే ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేశారు . ప్రభాస్ – శృతిహాసన్ – పృధ్విరాజ్ లతో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది చిత్ర యూనిట్ .దానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ.

వీటిల్లో సినిమా గురించే కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా చూస్ చేసుకున్నారు . ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ప్రభాస్ ని రాజమౌళి ఛత్రపతి సినిమాతో స్టార్ హీరో చేసేసాడు . ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ చేసేసాడు . ఈ విషయం మనందరికీ తెలిసిందే . ప్రభాస్ రాజమౌళి జాన్ జిగిడి దోస్తులు ..కలిసిమెలిసి ఉంటారు. మంచి బాండింగ్ ఉంది .

అయితే అలాంటి ప్రభాస్ రాజమౌళి పేరు చెప్పకుండా తాను బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది ఇద్దరు డైరెక్టర్స్ తో నేనే అని.. ప్రశాంత్ నీల్ గురించి వివి వినాయక గురించి చెప్పుకొచ్చాడు . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో జనాలు షాక్ అయిపోతున్నారు . అయితే ప్రభాస్ ఉన్నది ఉన్నట్లే చెప్తాడు అని ..ఎక్కడ అబద్ధాలు చెప్పడని ఆయన రాజమౌళితో కంఫర్టబుల్ గా లేడు కాబట్టే ఆ విషయాన్ని చెప్పలేదు అని ఫ్యాన్స్ ప్రభాస్ కామెంట్స్ ని సపోర్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news