Newsవావ్: మన మహేశ్ బాబు ఆటోగ్రాఫ్ చూశారా..? సూపర్ స్టార్ అనిపించాడుగా..!!

వావ్: మన మహేశ్ బాబు ఆటోగ్రాఫ్ చూశారా..? సూపర్ స్టార్ అనిపించాడుగా..!!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్ ని అభిమానులు ఆటోగ్రాఫ్ – ఫోటోగ్రాఫ్ అంటూ ఎక్కువగా అడుగుతూ ఉంటారు . ఆ విషయం మన అందరికీ తెలిసిందే . అయితే కొంతమంది చాలా ఓర్పుగా సహనంగా ఫ్యాన్స్ అడిగిన ఫోటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉంటే .. మరి కొంతమంది సెక్యూరిటీకి చెప్పి వాళ్ళని తోయించేస్తూ ఉంటారు . అయితే మన మహేష్ బాబు ఎప్పుడు అలా చేయలేదు.

రీసెంట్గా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమా సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది . అయితే మహేష్ బాబు రీసెంట్గా జర్మనీ వెళ్లారు. జక్కన్న తో సినిమా కోసమే వెళ్లిన్నట్లు సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే ఎయిర్పోర్టులో మహేష్ బాబు ఫ్యాన్ ఆయనతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు .

దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ఇప్పటివరకు ఎవ్వరూ చూడలేదు. దీంతో మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అంతేకాదు మహేష్ బాబు సింప్లిసిటీకి ఫిదా అయిపోతున్నారు. అందుకే మహేష్ బాబు అంత పెద్ద హీరో అయ్యాడు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ప్రస్తుతం మహేష్ బాబు ఆటోగ్రాఫ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news