Moviesనాని- వెంకీ - త్రివిక్ర‌మ్ మ‌ల్టీస్టార‌ర్ తీస్తే నిండా మునిగిపోవాల్సిందే... 100...

నాని- వెంకీ – త్రివిక్ర‌మ్ మ‌ల్టీస్టార‌ర్ తీస్తే నిండా మునిగిపోవాల్సిందే… 100 % ఇది నిజం…!

తాజాగా టాలీవుడ్‌లో నాని, వెంకీ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ సినిమా తెర‌కెక్కుతుంద‌ని.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అమ‌ల్లో ఈ కాంబినేష‌న్ సాధ్య‌మేనా అంటే ఇది జ‌రిగే ప‌నికాదు.. ఈ కాంబినేష‌న్లో సినిమా తీసినోళ్లు నిండా మున‌గాల్సిందే అన్న లెక్క‌లే క‌నిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం నాని 28 కోట్లు, వెంకీ 13 కోట్లు తీసుకుంటున్నారు. త్రివిక్ర‌మ్‌కు ఎలా లేద‌న్నా రు. 30 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ ముగ్గురి రెమ్యున‌రేష‌న్ల‌కే రు. 70 కోట్ల‌వుతోంది. మిగిలిన వాళ్ల రెమ్యున‌రేష‌న్లు చూసుకుంటే రు. 90 కోట్ల వ‌ర‌కు అవుతాయి. ఇక ప్రొడ‌క్ష‌న్ కాస్ట్‌తో క‌లుపుకుని రు. 150 కోట్ల వ‌ర‌కు ఈ సినిమా బ‌డ్జెట్ అవుతుంది. ఇక నాన్ థియేట‌ర్ మార్కెట్ ఎంతో గొప్ప‌గా జ‌రిగితే రు. 70 – 75 కోట్ల వ‌ర‌కు ఉండొచ్చు.

ఇక థియేట‌ర్ మీద భారం రు. 70 కోట్ల‌కు పై మాటే. అంటే రు. 80 కోట్ల రేంజ్‌లో సినిమాను అమ్మాలి. అంత షేర్ రావాలంటే క‌నీసం రు. 150 కోట్ల గ్రాస్ రావాలి. సినిమాకు మంచి టాక్ వ‌స్తే త‌ప్పా ఇది లాభ‌సాటి వెంచ‌ర్ కాదు. నాని ద‌స‌రా పెద్ద హిట్ అయితేనే అనుకున్న రేంజ్‌లో లాభాలు రాలేదు. ఇప్పుడు వెంక‌టేష్ క‌లిస్తే అంతే వ‌సూళ్లు ఉంటాయే త‌ప్పా డ‌బుల్ వ‌సూళ్లు ఏమీ రావు.

ఇక నిర్మాత‌లు ఇంత రిస్క్ చేసి.. ఇంత ఖ‌ర్చు పెట్టి ఈ ప్రాజెక్టు సెట్ చేసినా.. సినిమాకు హిట్ టాక్ వ‌స్తే బొటాబొటీ లాభాల‌తో బ‌య‌ట‌ప‌డ‌తారు. లేక‌పోతే నిండా మున‌గ‌డం ప‌క్కా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news