Movies"నేను అలాంటి దాని కాదు"..స్టేజీ పై కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్ కూతురు..!!

“నేను అలాంటి దాని కాదు”..స్టేజీ పై కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్ కూతురు..!!

ప్రెసెంట్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రజినీకాంత్ తాజాగా నటించిన సినిమా లాల్ సలాం . ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కాబోతుంది . తాజాగా భారీ ఎత్తున జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్ ఆయన భార్య లత కుమార్తె సౌందర్య, ఐశ్వర్య మనవళ్ళు పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే స్టేజి పైకి వచ్చిన ఐశ్వర్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు . “మా నాన్నగారు 35 ఏళ్లుగా వెండి తెర పై నటించి మంచి పేరు తెచ్చుకున్నారు . ఆ పేరుకు భంగం కలిగించే హక్కు ఏ కూతురికి ఉండదు . ఈ సినిమా కథ నచ్చడంతోనే ఆయన నటించడానికి అంగీకరించారు . నాకోసం ఈ చిత్రంలో ఆయన నటించలేదు . సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వార్తలు కామెంట్స్ నన్ను బాధించాయి “.

“ఒక స్టార్ కు అమ్మాయి అని గుర్తింపు ఉంటే చాలు ఇక్కడ ఎవరు సినిమా అవకాశం ఇవ్వరు . చిత్ర పరిశ్రమలో మీరు పెద్ద వ్యక్తి అయినప్పటికీ వారు మీకు సినిమా ఛాన్స్ ఇవ్వరు. కారణమేంటో నాకు తెలియదు . కొత్త వారికే ఛాన్సులు ఇస్తారు. దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమాకి పని చేస్తున్నప్పుడు నా పిల్లలతో ఎక్కువ సమయం గడపలేక పోయాను . వాళ్లు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు నా పిల్లలే నాకు గొప్ప అనుభూతి “అంటూ ఐశ్వర్య తెలిపింది…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news