Moviesబిగ్ బ్రేకింగ్: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. స్టార్ హీరో తండ్రి...

బిగ్ బ్రేకింగ్: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. స్టార్ హీరో తండ్రి మృతి..!

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్న విషాద ఛాయలు మరవకముందే మరొక స్టార్ సెలబ్రిటీ మరణిస్తూ ఉండడం ఫాన్స్ కు నిద్ర పట్టనివ్వడం లేదు . రీసెంట్గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తొట్టెంపూడి వేణు ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

వేణు తండ్రి గారు తొట్టెంపూడి వెంకట సుబ్బారావు గారు ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు . 92 ఏళ్ల వయసులో ఆయన వయోభారం చేత పలు అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ కన్నుమూసినట్లు తెలుస్తుంది . గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాగోలేదు . దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట . కానీ వయసు పైబడిపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించడంతో ట్రీట్మెంట్ కి సహకరించక ఆయన మృతి చెందినట్లు తెలుస్తుంది.

తొట్టెంపూడి వెంకటసుబ్బారావు ప్రొఫెసర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు . పొలిటికల్ , బిజినెస్ ఫ్యామిలీ గా తొట్టెంపూడి కుటుంబానికి మంచి పేరుంది. వేణు సినీ నటుడిగా కామెడీ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నారు . హీరోగా అవకాశాలు తగ్గడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమై ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటున్నారు తొట్టెంపూడి వేణు .

తొట్టెంపూడి వెంకట సుబ్బారావు భౌతిక కాయాన్ని సందర్శనా అనంతరం ఈరోజుమధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంతక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు . వేణు తండ్రి మరణించాడు అన్న విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news