Newsఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు..ఈ అబ్బాయి ఎవరి బిడ్డనో...

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు..ఈ అబ్బాయి ఎవరి బిడ్డనో తెలిస్తే మీసం మెలివేస్తారు..!!

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ పెద్ద కొత్తెం కాదు .. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు స్టార్ హీరోల వారసులు .తాజాగా ఆ లిస్టు లోకి యాడ్ అయిపోయాడు ఇక్కడ మీరు చూస్తున్న హీరో . ఇతను మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి .

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే నటనలో ఓనమాలు దిద్దిన సూర్య సేతుపతి తాజాగా హీరోగా ఎంట్రీ ఇస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు . ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . తమిళం – హిందీ – తెలుగు – మలయాళం భాషలలో అద్భుతమైన సినిమాలు చేసి స్టార్ గా ఎదిగిన విజయ్ సేతుపతి కి ఇద్దరు పిల్లలు సూర్య – శ్రీజ .

ఇద్దరు కూడా తండ్రి నటన పుణికి పుచ్చుకున్నారు . సూర్య ఇప్పటికే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు . అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు . ఇప్పటికే నటన డాన్స్ ఫైట్స్ లో పూర్తిస్థాయి శిక్షణ తీసుకున్నారు . సూర్య సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీనిక్స్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి . ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ తోనే అభిమానులను బాగా ఆకట్టుకునేసాడు ఈ సూర్య సేతుపతి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news