Moviesఆ స్టార్ డైరెక్ట‌ర్‌తో త‌మ‌న్నాకు సెట్లోనే గొడ‌వ జ‌రిగిందా....!

ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తో త‌మ‌న్నాకు సెట్లోనే గొడ‌వ జ‌రిగిందా….!

ప్రముఖ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె ఇటీవల తమిళంలో జైలర్ సినిమా చేసి ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఈమెకు గొడవలు ఉన్నాయట. అయితే ఇలా వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి గల కారణం ఏమిటి అన్న విషయం ఇప్పుడు చూద్దాం.

అనిల్ రావిపూడి ఈ మధ్యనే బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరి అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మరొకవైపు తమన్నా కూడా అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ లు అంటూ బిజీ బిజీగా ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

లవ్ , ఎమోషన్ , యాక్షన్, కామెడీ కలగలసిన ఈ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇలాంటి సమయంలో తమన్నా అనిల్ రావిపూడి మధ్య గొడవలు గల కారణం ఏమిటి అనే విషయంపై డైరెక్టర్ మాట్లాడుతూ.. నాకు తమన్నాకి మధ్య అంత పెద్ద గొడవ ఏం జరగలేదంటూనే … అస‌లు ఆ రోజు ఏం జ‌రిగిందో క్లారిటీ ఇచ్చాడు.

ఒకరోజు చాలామంది ఆర్టిస్టులతో కలిసి ఒక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో తమన్న నా టైం అయిపోయింది.. వెళ్తున్నాను అంది.. ఇక మార్నింగ్ రమ్మంటే మార్నింగ్ నేను జిమ్ కి వెళ్ళాలి కుదరదు అని చెప్పింది.. దాంతో ఇద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే మేము మళ్ళీ కలిసి పోయాము. ఇప్పుడు మా మధ్య ఎటువంటి గొడవలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news