Moviesవిశ్వంభర సినిమాలో ఆ సెక్సీ ఫిగర్ కూదా ఉందా..? నా స్వామి...

విశ్వంభర సినిమాలో ఆ సెక్సీ ఫిగర్ కూదా ఉందా..? నా స్వామి రంగా ఇక కుమ్ముడే కుమ్ముడు..!!

రోజు రోజుకి మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమాపై హైప్స్ పెరిగిపోతున్నాయి . బింబిసార సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వశిష్ట .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంభర .. టైటిల్ తోనే సగం హిట్ కొట్టేశాడు వశిష్ట. తన సినిమాకి సంబంధించిన టైటిల్స్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాడు వశిష్ట . అందుకే ట్రెడిషనల్ గా ఉండే విశ్వంభర అనే టైటిల్ను ఈ సినిమాకి పెట్టుకొచ్చాడు . ఈ సినిమా మొత్తం పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చెన్నై బ్యూటీ త్రిష నటించబోతుంది .

ఆల్రెడీ ఆమెకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి . ఈ సినిమాలో త్రిష డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతూ ఉండడం సినిమాకి హైలెట్ అయ్యే విషయం . కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్గా కన్నడ బ్యూటీ ఆషిక రంగన్నాధ్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత నాగార్జున నటించిన నా స్వామి రంగా సినిమాలో హీరోయిన్గా తన స్టామినా చూపించింది.

ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే ఛాన్స్ అందుకునింది ఆశిక రంగనాథ్ . దీంతో అమ్మడు పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఆశిక రంగనాథ్ కన్నడ బ్యూటీనే అయినప్పటికీ తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఈ సినిమా హిట్ అయితే ఒక రష్మిక మందన్నా.. ఒక శ్రీలీల.. పక్కన నిలిచునే స్థాయిని దక్కించుకుంటుంది ఆశిక రంగనాథ్ అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఆషికా టాలెంట్ ఎలా ప్రూవ్ చేసుకుంటుందో ..? తన తలరాతను తానే ఎలా మార్చుకుంటుందో..? తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే ..ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరిలో 2025వ సంవత్సరం రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news