Moviesఅమ్మ బాబోయ్.. హేమ అలాంటి పనులు చేసి కూడా డబ్బులు సంపాదిస్తుందా..?...

అమ్మ బాబోయ్.. హేమ అలాంటి పనులు చేసి కూడా డబ్బులు సంపాదిస్తుందా..? రేవ్ పార్టీతో బయటపడ్డ సంచలన నిజం..!

హేమ .. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు హేమ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే నటి అని మాత్రమే గుర్తించే వాళ్ళు .. ఎప్పుడైతే బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె పేరు వినపడిందో అప్పటినుంచి హేమాలోని మరో యాంగిల్ కూడా బయటపడింది అంటూ జనాలు ..ఆకతాయిలు.. ట్రోలర్స్..ఓ రేంజ్ లో ఆమెను ఆడేసుకుంటున్నారు .

హేమ ఏమో నేను రేవ్ పార్టీకి వెళ్ళలేదు అంటూ ధీమాగా చెప్తుంది. కన్నడ పోలీసులు ఏమో పార్టీకి వెళ్లింది అని.. కృష్ణవేణిగా తన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకుంది అని సాక్షాదారులతో చూపిస్తున్నారు. ఇప్పటికీ ఈ విషయంపై గందరగోళం నెలకొంది . అంతేకాదు హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ శాంపుల్స్ కూడా దొరకడం డ్రగ్స్ పాజిటివ్ రావడం ఆమె డ్రగ్స్ తీసుకుంది అని చెప్పడానికి బలంగా ఆధారాలు చేకూరినట్లు అయింది .బెంగళూరులో రేవ్ పార్టీ ఇష్యూ కారణంగా హేమ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . అంతేకాదు హేమకు సంబంధించిన పలు పాత వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబం గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చింది హేమ”.

“నా భర్త ఒక కెమెరామెన్ .. మా అమ్మ వాళ్లు కూడా బాగా డబ్బున్న వాళ్ళే.. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒంటినిండా అన్ని బంగారు నగలు వేసుకుని తిరిగేదాన్ని .. అది చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయేవారు ..మా ఊరిలో నాకు ఏమీ లోటు లేదు ..చాలా చాలా ఆస్తి ఉంది. కేవలం సినిమా ఇండస్ట్రీలో నటించడం ద్వారా మాత్రమే కాదు నేను పలు కిట్టి పార్టీలతో కూడా బాగానే సంపాదిస్తున్నాను ..లైఫ్ లో సెటిల్ అవ్వడానికి సరిపడా డబ్బులు కూడా ఉంది ..నాకు ఏ కష్టాలు లేవు ఐయామ్ వెల్ సెటిల్.. అయితే అందరూ అనుకున్నట్లు 200 కోట్లు 400 కోట్లు ఆస్తులు అయితే లేవుగాని.. ఉన్నదాంట్లో చాలా సంతోషంగా ఉన్నాను . దీంతో సోషల్ మీడియాలో హేమా కామెంట్స్ వైరల్ గా మారాయి”. కొంతమంది హేమ నిజాయితీపరురాలు అంటుంటే మరి కొంతమంది మాత్రం అంత ఆస్తి ఉంది కాబట్టే నువ్వు బెంగళూరు రేవ్ పార్టీకి అంత డబ్బులు ఖర్చు చేసి ఎంజాయ్ చేయడానికి వెళ్లావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news