Moviesఓరి దేవుడోయ్..నందమూరి ఫ్యాన్స్ కొత్త డిమాండ్ విన్నారా ..? మోక్షజ్ఞ పక్కన...

ఓరి దేవుడోయ్..నందమూరి ఫ్యాన్స్ కొత్త డిమాండ్ విన్నారా ..? మోక్షజ్ఞ పక్కన ఆ హీరోయిన్ నే కావాలట..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వార్త బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ . గత మూడేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిగో ఎంట్రీ అదిగో ఎంట్రీ అంటున్నారే తప్పిస్తే ఎక్కడా కూడా ఇదిగో ఎంట్రీ అంటూ అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం బాలకృష్ణ కొడుకు ఎంట్రీ గురించి భారీ ఎత్తున ప్లాన్స్ వేశాడు అన్న వార్త మాత్రం కన్ఫామ్ చేసేస్తున్నారు నందమూరి అభిమానులు .

ఇప్పటికే టాప్ మోస్ట్ డైరెక్టర్ అందరితోనూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి డిస్కస్ చేశారట. ఫైనల్లీ టాప్ త్రీ డైరెక్టర్స్ ను చూస్ చేసుకున్నారట. అంతేకాదు ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా వచ్చే ఆదిత్య 999 సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే అది ఇప్పుడే కాదు అని 2025 సెప్టెంబర్ పైనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇస్తే ఆ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలా ఉండాలి అంటూ ఫ్యాన్స్ కోరుకున్నారు ..

భగవంత్ కేసరి సినిమా షూట్ టైంలో శ్రీ లీల మోక్షజ్ఞ కలిసిన పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరు ది బెస్ట్ కపుల్ పెయిర్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు . సీన్ కట్ చేస్తే శ్రీ లీల రేంజ్ ఇప్పుడు ఢమాల్ అంటూ పడిపోయింది . దీంతో ఆమె వద్దు హీరోయిన్గా అంటున్న నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. శ్రీ లీల బదులు లేటెస్ట్ మలయాళీ సెన్సేషన్ మమిత బైజు ..మోక్షజ్ఞ సినిమాల్లో నటించాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు .

ప్రేమలు సినిమాలో నటించి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ తో నటించే అవకాశం కూడా దక్కించుకుంది . అంతేకాదు రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోనూ సెకండ్ హీరోయిన్గా చూస్ చేసుకున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఉండాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news