Moviesఎంత ట్రై చేసినా బాలయ్య ఆ రెండు సినిమాలకు సీక్వెల్ తీసుకురాలేకపోతున్నాడే..కారణం...

ఎంత ట్రై చేసినా బాలయ్య ఆ రెండు సినిమాలకు సీక్వెల్ తీసుకురాలేకపోతున్నాడే..కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో సినిమాలకు సీక్వెల్స్ రావడం మనం కామన్ గా చూస్తున్నాం . మరీ ముఖ్యంగా బడాబడా స్టార్ హీరోలు డైరెక్టర్లు మేకర్స్ గతంలో వాళ్ళు తెరకెక్కించిన సూపర్ డూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీసుకొస్తున్నారు . కొందరు రీ రిలీజ్ పేరిట సినిమాలను రిలీజ్ చేస్తూ మళ్లీ ఆ సినిమాలను జనాలు చూసి ఎంజాయ్ చేసే విధంగా చేస్తున్నారు. తాజాగా మనం సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేము కానీ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి .

ఫ్లాప్ అయిన సినిమాలలో కూడా తన నటన పరంగా మెప్పించాడు బాలకృష్ణ . కాగా బాలకృష్ణ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సినిమా సమరసింహారెడ్డి. ఈ సినిమా అప్పట్లో ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నరసింహనాయుడు సినిమా కూడా బాగా జనాలను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించాలి అని బాలయ్య ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారట కానీ .. అది కుదరడం లేదు .

బాలయ్యే కొన్నిసార్లు ఈ సినిమాకి సీక్వెల్స్ వద్దు అంటూ బ్యాక్ స్టెప్ వేస్తున్నారట. ఎందుకంటే మనం నటించిన సినిమాలు హిట్ అయిన తర్వాత మళ్లీ ఆ సినిమాలను సీక్వెల్ పేరిట తెరకెక్కించి ఆ సినిమా హిట్ అయితే పర్లేదు ఫ్లాప్ అయితే మాత్రం ఉన్న చరిత్రను బ్రష్టు పట్టించిన వాళ్ళం అవుతాము అని బాలకృష్ణ భయపడి ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఇన్నాళ్లు రాజకీయాలలో బిజీబిజీగా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు బాబి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో బిజీ అయిపోయాడు . ఈ సినిమా షూట్స్ టకటక కంప్లీట్ చేసేయాలి అంటూ బిజీ బిజీగా హైదరాబాద్లో ఈ సినిమా షూట్ కోసం ప్రత్యేక సెట్ వేయిస్తున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news