ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ పై ఎలాంటి ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయో చూస్తున్నాము.. అంతేకాదు దారుణాతి దారుణమైన ట్రోలింగ్ కూడా జరుగుతుంది . అవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆయనలోని మంచితనాన్ని ఎప్పటికప్పుడు అందరికీ గుర్తు చేస్తూనే ఉంటారు . అయితే తాజాగా విరాట్ కోహ్లీ గతంలో జూనియర్ ఎన్టీఆర్ పై మాట్లాడిన మాటలు తాలూకా వీడియోని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు.
వాళ్లిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ విరాట్ కోహ్లీ మంచి స్నేహితులు ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు . తాజాగా మరొకసారి ఆ విషయం బయటపడింది . ఆ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ..”జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలలో అందరికన్నా బెస్ట్ హీరో.. ఆయన నటన చాలా అద్భుతంగా ఉంటుంది . ఒక యాడ్లో మేము స్క్రీన్ షేర్ చేసుకున్నాం”..
“ఆ యాడ్ పుణ్యమాంటూ ఎన్టీఆర్ రియల్ క్యారెక్టర్ నాకు తెలిసింది. ఎంత గొప్ప మంచి మనసు .. చాలా సాఫ్ట్ నేచర్ వెరీ వెరీ హంబుల్ పర్సన్.. ఎన్టీఆర్ లాంటి హీరో నా బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు నాకు వెరీ హ్యాపీ. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ ఎన్నిసార్లు చూసినా తనవి తీరదు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే హీ ఈజ్ ద బెస్ట్ యాక్టర్.. నో డౌట్ ” అంటూ తనదైన స్టైల్ లో జూనియర్ ఎన్టీఆర్ను పొగిడేసారు .
దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . అంతేకాదు త్వరలోనే దేవర సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాతో మరొక మెట్టు పైకి ఎక్కబోతున్నాడు తారక్ అంటూ నందమూరి ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు . వార్ 2 సినిమాలోనూ నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నాడు తారక్. ఈ సినిమాపై కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు..!!
Junior NTR is my best friend among Telugu heroes , Words are not enough to describe NTR's performance in RRR
— Milagro Movies (@MilagroMovies) May 26, 2024
:- #ViratKohli pic.twitter.com/Bw9tJZkQtI