Newsజ‌గ‌ప‌తిబాబును వీడేం హీరో అని న‌వ్వి అవ‌మానించారా... చివ‌ర‌కు ఆ లోప‌మై...

జ‌గ‌ప‌తిబాబును వీడేం హీరో అని న‌వ్వి అవ‌మానించారా… చివ‌ర‌కు ఆ లోప‌మై స్టార్ హీరోను చేసిందా..!

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కెరీర్ ప్రారంభం నుంచి చేస్తుంది ప్రయోగాలే. సినిమా హిట్ అవ్వాలనే రూల్ పెట్టుకోకుండా ఓ కథ అనుకొని దానీ సినిమాగా తీసి రిలీజ్ చేసేస్తారు. ఒక్కసారి సినిమా రిలీజ్ అయిందంటే మళ్ళీ దాని గురించి పట్టించుకోరు. కాబట్టే వర్మ ఇన్ని రకాల చిత్రాలను చేస్తూ వస్తున్నారు.

ఇక టెక్నీషియన్స్ విషయం అయితే చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాకి అందరూ దాదాపు కొత్తవాళ్ళే పనిచేస్తారు. కాబట్టే రాము బడ్జెట్ ఇంత కావాలని ఎప్పుడూ నిర్మాతని అడగడు. ఆ సినిమాకి ఎంత అవసరమో అంతే ఖర్చు చేయిస్తారు. ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ టెక్నీషియన్స్ అందరూ ఒకప్పుడు వర్మ దగ్గర 30 వేలకి, నలభై వేలకి పనిచేసిన వారే.

ఇక నటీనటులైతే ఎంతమంది లైం లైట్ లోకి వచ్చారో చెప్పనవసరం లేదు. వారిలో జగపతిబాబు కూడా ఉన్నారు. గాయం సినిమా వరకూ అసలు జగపతి బాబు గొంతు ఎలా ఉంటుందో జనాలకి తెలియదు. అప్పటి వరకూ జగపతిబాబు నటించిన సినిమాలకి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. కానీ, ఆర్జీవీ గాయం సినిమా సయమలో నువ్వే సొంతగా ఎందుకు డబ్బింగ్ చెప్పకూడదు అని అడిగారు.

నా గొంతు వింటే ఎవడూ సినిమా చూడటానికి రారని నవ్వారట. దానికి వర్మ..ఈ సినిమాకి నువ్వే డబ్బింగ్ చెప్పు..నీకు తెలీదు నూ వాయిస్ ఎలా ఉంటుందో. గాయం తర్వాత నీ వాయిస్ కి ఎంతమంది ఫ్యాన్స్ అవుతారో అన్నారట. అలా జగ్గుకి ఆర్జీవి ధైర్యం చెప్పి గాయం కి సొంతగా డబ్బింగ్ చెప్పేలా ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత నుంచి జగపతిబాబు కి తన వాయిస్సే అన్నీ రకాలుగా ప్లస్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news