Moviesగుంటూరు కారం నుంచి థ‌మ‌న్ అవుట్‌.. అబ్దుల్ వాహిబ్ ఇన్‌..!

గుంటూరు కారం నుంచి థ‌మ‌న్ అవుట్‌.. అబ్దుల్ వాహిబ్ ఇన్‌..!

మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ? అన్న డైల‌మా ఇంకా కొనసాగుతూనే వస్తోంది. ఈ సినిమాకు మొదటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ విషయంలో చాలా సందేహాలు వినిపించాయి. థ‌మన్‌ను పక్కన పెట్టేస్తున్నారు.. థ‌మ‌న్‌ను కొనసాగించడం మహేష్ కు ఇష్టం లేదన్న పుకార్లు కూడా వచ్చాయి. అవన్నీ గాలివర్తలే అని థ‌మన్‌ కొట్టి పడేసిన తెరవెనక జరిగేది మాత్రం జరుగుతూనే ఉందని తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ సినిమా కోసం థ‌మ‌న్‌ ఇచ్చిన ట్యూన్లు ఏవి మహేష్ బాబుకు నచ్చలేదని తెలుస్తోంది. ఈ నెల 9న మహేష్ బర్తడే వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక పాట వదలాలని నిర్మాతలు అనుకున్నారు. ఇప్పటికే మీడియాలో కూడా ఈ విషయం వచ్చింది. ఈ నెల 9న రిలీజ్ చేసే పాట కోసం థ‌మన్‌ ముంబై వెళ్లి ట్యూన్ రికార్డు చేయించుకుని వచ్చారట. అయితే విదేశాల్లో ఉన్న మహేష్ బాబుకు ఆ ట్యూన్ పంపితే అక్కడ నుంచి ఇంకా ఆమోదముద్ర రాలేదని తెలుస్తోంది.

మహేష్ బాబు ఓకే అంటేనే వెంటనే ఆ పాట పాడిన చేసి రెడీ చేస్తారు. లేకపోతే ఈ ట్యూన్ ఓకే కానట్టే. ఇక మహేష్ బర్త్ డేకు కూడా పాట రిలీజ్ చేయడం అన్నది జరగదు. దీంతో అసలు టెన్షన్ త్రివిక్రమ్ కు.. థ‌మన్‌కు మొదలైపోయినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా మహేష్ బర్త్ డే సాంగ్ రిలీజ్ అయితే గుంటూరు కారం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ? అన్నదానిపై కూడా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

అయితే థ‌మన్ ఈ సినిమాకు కొనసాగుతాడా లేదా థ‌మన్‌ ప్లేసులో అబ్దుల్ వహీబ్ ఎంట్రీ ఉంటుందా అన్నదానపై ఇండస్ట్రీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news