Moviesటెలివిజన్ చరిత్రలోనే ఇది ఓ సంచలనం..బుల్లితెర పై 1000 కంటే ఎక్కువ...

టెలివిజన్ చరిత్రలోనే ఇది ఓ సంచలనం..బుల్లితెర పై 1000 కంటే ఎక్కువ సార్లు ప్ర‌సార‌మైన మహేశ్ మూవీ ఏదో తెలుసా..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబుకు ఉన్న స్పెషల్ అట్రాక్షన్..క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ హీరోకి లేదనే చెప్పాలి . ఇండస్ట్రీలో తన పని తాను చూసుకో పోతున్న హీరోలలో ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు అనే చెప్పాలి. కాంట్రవర్షియల్ కంటెంట్ లో వేలు పెట్టడు .. తన జోలికి వస్తే మాత్రం ఎవర్ని వదిలిపెట్టరు. అలాంటి ఓ మైండ్ సెట్ తో ఉన్న మహేష్ బాబు ఓవైపు సినిమాలు మరోవైపు బిజినెస్ లల్లో దూసుకుపోతున్నాడు .

కాగ రీసెంట్గా మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటివరకు తెలుగులో ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు మహేష్ బాబు . బుల్లితెరపై ఏకంగా 1000 సార్లు కంటే ఎక్కువసార్లు ప్రసారమైన సినిమాగా మహేష్ బాబు నటించిన సినిమా రికార్డు నెలకొల్పింది. ఆ సినిమా మరి ఏదో కాదు “అతడు”. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించాడు .

హీరోయిన్గా త్రిష తన అందచందాలతో ఈ సినిమాలో మెప్పించింది . 2005 ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది . అంతే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కు మహేష్ బాబును దగ్గర చేసింది ఈ సినిమానే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమా బుల్లితెరపై ఎక్కువగా ప్రసారమైన లిస్టులోకి యాడ్ అయిపోయింది . ఇప్పటివరకు తెలుగు సినిమాలలో ఏ స్టార్ హీరో మూవీ ఈ సినిమా లాగా ఏకంగా బుల్లితెరపై 1350 సార్లు టెలికాస్ట్ కాలేదు. ఈ సినిమా లోని స్పెషాలిటి ఇదే. ఎన్నిసార్లు ప్రసారమైన సరే ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అంటున్నారు అభిమానులు . దీంతో ఈ క్రేజీ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిందని.. ఈ న్యూస్ ని వైరల్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news