News' భోళా శంక‌ర్ ' డిజాస్ట‌ర్‌కు కొర‌టాల‌కు లింక్ ఏంటి...!

‘ భోళా శంక‌ర్ ‘ డిజాస్ట‌ర్‌కు కొర‌టాల‌కు లింక్ ఏంటి…!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన.. ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద తొలి ఆట‌ నుంచి డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం సినిమాకు రీమేక్గా వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం అజిత్ హీరోగా తమిళంలో తెరకెక్కిన.. ఈ రొటీన్ స్టోరీని అసలు చిరంజీవి ఎందుకు ? రీమేక్ చేశారు. పైగా మెహర్ రమేష్ ను ఎందుకు ? డైరెక్టర్గా తీసుకున్నారో మెగా అభిమానులకు కూడా అర్థం కావడం లేదు.

సినిమాలో ఒక్కటంటే ఒక్క సీను కూడా సరిగా పడలేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు సడన్ గా సోషల్ మీడియాలో భోళాశంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్ తో పాటు ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ కూడా నెట్టింట ట్రెండింగ్ గా మారాడు. ఈ సినిమా ప్లాప్ అవటానికి కొరటాలకు లింక్ ఏంటని ? అనుకుంటున్నారా.. చిరంజీవితో గత ఏడాది కొరటాల శివ ఆచార్య సినిమా తెరకెక్కించాడు.

ఆ సినిమా కూడా తొలి రోజుకే డిజాస్టర్ టాక్ కు రావడంతో కొరటాల శివ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కూడా చిరంజీవి ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ పరోక్షంగా కొరటాలను దేప్పి పొడిచాడు. ఇక ఇప్పుడు భోళాశంకర్ సినిమాకు కూడా డిజాస్టర్ టాక్ రావడంతో నెటిజన్లు నాడు కొరటాల శివను ట్రోల్ చేసినట్టుగానే.. ఇప్పుడు అదే మీమ్స్ తో మెహర్ రమేష్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు అయితే కొరటాల శివ మెహర్ రమేష్ ఫోటోలు మిక్స్ చేసి మరి ఆడుకుంటున్నారు.

ఏది ఏమైనా అప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేకుండా సూపర్ హిట్లతో దూసుకుపోయిన కొరటాల శివ ఆచార్య దెబ్బతో తన కెరీర్లు మెగా అభిమానులు నుంచి ఎప్పుడు విమర్శలు ఎదుర్కొనే స్థితికి జారిపోయాడని చెప్పాలి. చిరంజీవి నుంచి ఎప్పుడు ప్లాప్ సినిమా వచ్చినా మెగా అభిమానులు కొరటాలను కూడా వదిలేలా లేరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news