Newsఅదేంటి పెళ్ల‌యిన హ‌న్సిక‌ను - శింబును క‌లుపుతోన్న జైల‌ర్ డైరెక్ట‌ర్‌.. ఇది...

అదేంటి పెళ్ల‌యిన హ‌న్సిక‌ను – శింబును క‌లుపుతోన్న జైల‌ర్ డైరెక్ట‌ర్‌.. ఇది నిజం..!

ఈ టైటిల్ కాస్త విచిత్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కోలీవుడ్ హీరో శింబు, హన్సిక ఒకప్పుడు ప్రేమ పక్షులు. వీరిద్దరూ ఎక్కడ చూసినా చట్టపట్టలేసుకుని తిరిగేవారు. ఆ తర్వాత వీరికి బ్రేకప్ అయ్యింది. హన్సిక ఇప్పటికే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయింది. అడపాదడపా సినిమాలు కూడా చేస్తోంది. ఇక శింబు ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు. సినిమాలతో దండయాత్రలు చేస్తూనే వస్తున్నాడు.

పెళ్లి అయిన హన్సిక ను పెళ్లికాని శింబుతో కలపటం ఏంటి ? అది కూడా తాజాగా రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ వీరిని ఎందుకు కలపాలనుకుంటున్నాడు. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దాం. రజనీకాంత్ జైల‌ర్‌ సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ కు వచ్చింది. దీంతో డైరెక్టర్ నెల్సన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన కోలమావు కోకిల సినిమాతో దర్శకుడుగా నెల్సన్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత శివ కార్తికేయంతో డాక్టర్ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత గత ఏడాది విజయ్ హీరోగా వచ్చిన బీస్ట్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ప్లాప్ టాక్‌ వచ్చినా కూడా రు. 200 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది.

అయితే వీటన్నిటికంటే ముందుగా శింబు హీరోగా హన్సిక హీరోయిన్గా తెరకెక్కిన వేట్ట మన్నై సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు నెల్సన్. ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరుపుకుని కూడా అనుకోని కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు జైలర్ సినిమా సూపర్ హిట్ కావడంతో మళ్లీ ఆ సినిమాను పూర్తి చేయాలని నెల్సన్ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే నెల్సన్ – హీరో శింబు మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడ వరకు బాగానే ఉంది.

మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టులో హన్సిక హీరోయిన్గా ? నటిస్తుందా అన్నది చూడాలి. హన్సిక – శింబు గతంలో ప్రేమికులు అన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ తర్వాత కూడా మీరు మధ్య పాత స్నేహం చిగురించింది. హన్సిక 50వ సినిమా మహాలో శింబు గెస్ట్ రోల్ చేశాడు. అలాగే ఇప్పుడు ఈ వేట మన్నన్ సినిమాను తిరిగి పూర్తి చేస్తారా ? అన్నదానిపై టాలీవుడ్ లో డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news