Moviesఫ్లాప్ అయినా 100 కోట్లు కలెక్ట్ చేసిన పవన్ కల్యాణ్ సినిమాలు...

ఫ్లాప్ అయినా 100 కోట్లు కలెక్ట్ చేసిన పవన్ కల్యాణ్ సినిమాలు ఇవే.. పవర్ స్టార్ మ్యాజిక్ అంటే ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వచ్చే కిక్ వేరేగా ఉంటుంది . ఈ విషయం కొత్తగా చెప్పక్కర్లేదు ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని టచ్ చేస్తే చెప్పే మాటే ఇది . ఆయన్ని అందరూ హీరోలా కాదు ఓ దేవుడులా భావిస్తూ ఉంటారు . ప్రజెంట్ ఓవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. ఎలక్షన్ డేట్ ముందుకు వచ్చేసరికి కమిట్ అయిన క్రేజీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే విధంగా ప్రణాళికను ముందుకు తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్.

ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కెరియర్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాల పేర్లు ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు సినిమా పరంగా డిజాస్టర్ అయిన 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఇవే అంటూ సినిమా ల లిస్ట్ బయటపెడుతున్నారు పవన్ ఫ్యాన్స్ అవేంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం . పవన్ కళ్యాణ్ శృతిహాసన్ జంటగా నటించిన కాటమరాయుడు సినిమా ఎంతటి డిజాస్టర్ టాక్ ని అందుకుందో తెలిసిందే. పవన్ కళ్యాణ్ రేంజ్ కి ఆ సినిమా మ్యాచ్ అవ్వలేదు . అయినా సరే కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము దులిపేసింది . కిషోర్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు . ఈ సినిమా 100కోట్లు క్రాస్ చేసింది.

అజ్ఞాతవాసి: పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కాంబినేషన్లో వచ్చిన భారీ ఎక్స్పెక్టేషన్స్ సినిమా అజ్ఞాతవాసి . ఈ సినిమా షూటింగ్ టైంలో రిలీజ్ టైం లో ఎంత హంగామా నడిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఈ సినిమాలో కీర్తి సురేష్ – అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించారు . 2018 లో గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది. పవన్ కెరియర్ లోనే చెత్త టాక్ క్రియేట్ చేసుకున్న సినిమా ఇదే. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం 100 కోట్లు సాధించింది . నిజంగా ఇది రికార్డు అనే చెప్పాలి. కేవలం పవన్ కళ్యాణ్ కి ఇలాంటి రికార్డ్స్ సాధ్యమని కూడా మనం చెప్పుకోవాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news